తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: బోధన్ నియోజకవర్గం గురించి తెలుసుకోండి
తెలంగాణ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో బోధన్ ఒకటి. ఇది నిజామాబాద్ లోకసభ పరిధిలో ఉంది. 1952లో ఏర్పడిన ఈ నియోజకవర్గం నుంచి 2014లో అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి మహ్మద్ షకీల్ విజయం సాధించారు. అతను తన సమీప అభ్యర్థి, కాంగ్రెస్ నేత సుదర్శన్ రెడ్డి పొద్దుటూరిపై 15,884 ఓట్ల మెజార్టీతో గెలిచారు. షకీల్‌కు 67,426 ఓట్లు రాగా, సుదర్శన్ రెడ్డికి 51,543 ఓట్లు వచ్చాయి. 1952 నుంచి నాలుగుసార్లు ఇండిపెండెంట్లు గెలిచారు. 1983లో ఇండిపెండెంట్ గెలిచారు. ఆ తర్వాత వరుసగా మూడుసార్లు టీడీపీ, ఆ తర్వాత వరుసగా మరో మూడుసార్లు కాంగ్రెస్ గెలిచింది. 2014లో మాత్రం టీఆర్ఎస్ విజయం సాధించింది.

మరిన్ని నిజామాబాద్ వార్తలుView All
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!