నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హవ్వా.. కేసీఆర్ సభకు కార్యకర్తలు, బస్సులో మందుతాగుతూ..(వీడియో)

|
Google Oneindia TeluguNews

నిజామాబాద్ కొత్త కలెక్టరేట్ భవన సముదాయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఆ తర్వాత బహిరంగ సభ వేదికపై మాట్లాడారు. కానీ అంతకుముందు జన సమీకరణ జరిగింది. అందులో కార్యకర్తలను తరలిస్తున్నారు. అంతా బానే ఉంది కానీ.. వారంతా మందు కొడుతున్నారు. దీనిని కొందరు వీడియో తీశారు. ఇంకేముంది ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో తిరుగుతుంది.

బస్సులో మందు తాగుతూ..

బస్సులో మందు తాగుతూ..

ఆ బస్సులో ఒకరు, ఇద్దరు కాదు.. అందరూ మందు తాగుతున్నారు. అరుపులు వేస్తూ.. తెగ నవ్వుకున్నారు. వీడియో తీసింది తెలుసో లేదో తెలియదు.. కానీ అంతా మందులో మునిగిపోయారు. కేసీఆర్ సభకు వీరంతా తాగి వెళ్లి.. ఏం సందేశం ఇస్తున్నారని కొందరు అంటున్నారు. ఆ బస్సులో కార్యకర్తలు మాత్రం.. చక్కగా నవ్వుతూ కనిపించారు.

జాతీయ రాజకీయాలు

జాతీయ రాజకీయాలు


అంతకుముందు బహిరంగ సభపై కేసీఆర్ మాట్లాడారు.'పోదామా దేశ రాజకీయాలకు?' అని ప్రజలను అడిగారు. 2024లో బీజేపీయేతర ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని నిజామాబాద్ నుంచి పిలుపునిచ్చారు. తెలంగాణ రైతాంగం మాదిరే యావత్ దేశ రైతాంగానికి ఉచిత కరెంటు ఇస్తామని హామీ ఇస్తున్నామని తెలిపారు. దేశం కోసం తెలంగాణ రాష్ట్రం నుంచే పోరాటం చేయాలని అన్నారు. బావుల వద్ద మీటర్ పెట్టాలంటున్నారో, ఎవరైతే రైతులను ఆత్మహత్యలు చేసుకుని చావలంటున్నారో వారికే మనం మీటర్ పెట్టాలి... అప్పుడే మనం బాగుపడతాం అని కేసీఆర్ అన్నారు.

అమ్మడమే పని

అమ్మడమే పని

ఉన్నవి అమ్ముకోవడం తప్ప ఈ మోడీ ఒక్క ప్రాజెక్టు కట్టాడా? ఫ్యాక్టరీ అయినా పెట్టాడా? అని అడిగారు. మోటర్లకు మీటర్లు పెట్టి అన్నీ గుంజుకుంటే మనం శంకరగిరి మాన్యాలు పట్టి కూలిపనులు చేయాలి అని కేసీఆర్ కామెంట్ చేశారు. ప్రతి గ్రామంలో రైతు బిడ్డలు, రైతు సంఘాలు సమావేశమై, ఏ పార్టీ రైతు వ్యతిరేక విధానాలు అవలంబించినా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

కొట్లాడాల్సిన సమయం వచ్చింది

ఇప్పుడు ప్రజాస్వామ్య, లౌకిక భారతదేశం కోసం కొట్లాడాల్సిన సమయం వచ్చిందని కేసీఆర్ అన్నారు. దేశ రాజకీయాలను మార్చేందుకు ముందుకు వెళదామా? తెలంగాణను ఏ విధంగా బాగు చేసుకున్నామో, దేశాన్ని కూడా అదే రీతిలో బాగు చేసుకుందాం అని కామెంట్ చేశారు. నిజామాబాద్ సాక్షిగా చెబుతున్నా... త్వరలో జాతీయ రాజకీయాల్లో ప్రస్థానం ప్రారంభిస్తున్నాం.. వచ్చే ఎన్నికల్లో ఢిల్లీలో ఎగిరేది బీజేపీయేతర జెండానే అని కేసీఆర్ స్పష్టం చేశారు.

English summary
trs workers drunk in the bus, they goes to kcr meeting. video viral in the social media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X