చిరకాల స్వప్నాన్ని నెరవేర్చిన వైఎస్ జగన్
Uddanam water project: ఉత్తరాంధ్ర ప్రజలను ఎన్నో ఏళ్లుగా వేధిస్తోన్న అంశం.. ఉద్దానం కిడ్నీ సమస్య. ప్రభుత్వాలు ఎన్ని మారినప్పటికీ- దీనికి మాత్రం పరిష్కారం దొరకలేదు. విషతుల్యమైన అక్కడి మంచినీటి ప్రభావం వల్ల వేలాదిమంది కిడ్నీ సమస్యను ఎదుర్కొంటోన్నారు. ఆసుపత్రుల పాలయ్యారు.
ఉద్దానం ప్రాంతంలో సుమారు లక్షమంది వరకు జనాభాలో అందులో 35 శాతం మంది కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వాళ్లే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దీనికి శాశ్వత పరిష్కారాన్ని చూపించింది. ఉద్దానం ప్రాంతానికి మంచినీటిని సరఫరా చేయడానికి ప్రత్యేకంగా ఓ ప్రాజెక్టును నిర్మించింది. దీని నిర్మాణ వ్యయం 700 కోట్ల రూపాయలు.

ఉద్దానం ప్రాంతానికి సుమారు 100 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న హిరమండలంలో గల రిజర్వాయర్ నుంచి వంశధార నది బ్యాక్ వాటర్ నుంచి మెలియాపుట్టి శుద్ధి కేంద్రానికి మంచి నీటిని తరలించడం ఈ ప్రాజెక్ట్ ఉద్దేశం. తొలి దశ ట్రయల్ రన్ సైతం ఇదివరకే విజయవంతంగా పూర్తయింది. 32 కిలోమీటర్ల పొడవున భూగర్భ పైప్‌లైన్ ద్వారా నీటిని ఈ నీటి శుద్ధి కేంద్రానికి చేర్చుతారు.
అక్కడి నుంచి 132 కిలోమీటర్ల మేర భూగర్భ పైప్‌లైన్‌ను నిర్మించి ఉద్దానం చివరి ప్రాంతమైన ఇచ్చాపురం వరకు ప్రతి ఒక్కరికి రక్షిత మంచినీటిని అందిస్తారు. ఇచ్ఛాపురం, పలాస అసెంబ్లీ నియోజకవర్గాల్లోని మండలాల పరిధిలో ఉన్న గ్రామాలకు ఈ శుద్ది కేంద్రం నుంచి మంచినీరు అందుతుంది.
అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే వైఎస్ జగన్ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ భారీ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయింది. ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఈ నెల 15వ తేదీన వైఎస్ జగన్ చేతుల మీదుగా ఈ ప్రాజెక్టును ప్రారంభించడానికి శ్రీకాకుళం జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది.












Click it and Unblock the Notifications