కామంతో సోదరిపై అత్యాచారం చేసిన సోదరుడు: ఫోక్సో చట్టం క్రింద కేసు నమోదు

బాలికా సంరక్షణ చట్టాలు నేరగాళ్ళను ఆపలేకపోతున్నాయి. బాలికా సంరక్షణ కోసం చట్టాలు ఎన్ని ఉన్నా అవి బాలికలను కాపాడలేకపోతున్నాయి . కామాంధులకు ఉరిశిక్ష వేసినా,నిర్భయ వంటి కఠిన చట్టాలు అమలవుతున్నా,ఎన్ కౌంటర్ లు చేసినా సరే అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. ఒకపక్క కరోనాతో ప్రపంచమే విలవిలలాడుతున్నా సరే కామంధుల కళ్ళు ఆకృత్యాల మీదకే వెళ్తున్నాయి. ఫలితంగా లాక్ డౌన్ కొనసాగుతున్న సమయంలో కూడా వావి వరసలు మరిచి అత్యాచారాలు జరుగుతున్నాయి.

నైతిక విలువల పతనం .. చెల్లిపై అన్న అత్యాచారం

నైతిక విలువల పతనం .. చెల్లిపై అన్న అత్యాచారం

మనుషుల్లో రోజురోజుకీ నైతిక విలువల పతనం కొనసాగుతుంది. మానవతా విలువలు అంటే ఏమిటో కూడా మరచిపోతున్న పరిస్థితి నెలకొంది. పశు ప్రవృత్తి పెరుగుతుంది . పోక్సో చట్టాల్లో సవరణలు చేసినా, చిన్నారులపై లైంగిక దాడులు చేస్తే ఉరి శిక్ష వేసేలా చట్టాలు మార్చినా సరే అన్నెం పున్నెం ఎరుగని పసికందులను కామాంధులు చిదిమేస్తున్న సంఘటనలు మళ్లీ మళ్లీ జరుగుతున్నాయి. ఇక తాజాగా సొంత బాబాయి కొడుకే ఒక మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు .

శ్రీకాకుళం జిల్లాలో దారుణం .. పెదనాన్న కూతురిపై అఘాయిత్యం

శ్రీకాకుళం జిల్లాలో దారుణం .. పెదనాన్న కూతురిపై అఘాయిత్యం

లాక్ డౌన్ సమయంలో అందరూ ఇంటికే పరిమితం కావడంతో క్రైమ్ రేట్ తగ్గిపోయిందని భావిస్తున్నా మళ్ళీ నిదానంగా కామాంధుల అకృత్యాలు బయటపడుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో ఇటీవలే ఓ దారుణం చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంలో దంపతులకు ముగ్గురు కుమార్తెలున్నారు. ఆయన భార్య కొన్నేళ్ల క్రితమే చనిపోవడంతో పిల్లలతో కలిసి ఆయన జీవనం సాగిస్తున్నాడు . ఆయన ఇంటి పక్కనే తమ్ముడి కుటుంబం కూడా నివాసం ఉంటోంది.ఇక వారిలో పెద్ద కుమార్తెపై అన్న వరసయ్యే బాబాయి కొడుకు అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఫోక్సో చట్టం క్రింద కేసు నమోదు .. నిందితుడి అరెస్ట్

ఫోక్సో చట్టం క్రింద కేసు నమోదు .. నిందితుడి అరెస్ట్

ఆ ముగ్గురు ఆడపిల్లలు తరుచూ బాబాయి ఇంటికి వెళ్లేవారు. దీంతో ఎవరికీ బాబాయి కుమారుడిపై ఎలాంటి అనుమానం లేదు. బాధితురాలి తండ్రి పనికి వెళ్లగా, ఇంట్లో ఎవరూ లేరని గమనించిన పక్కింట్లో ఉండే పెదనాన్న కొడుకు పరమేష్ బాధితురాలిపై అత్యాచారం చేశాడు.తండ్రి ఇంటికి వచ్చిన తరువాత బాలిక బాబాయి కొడుకు చేసిన పని తండ్రికి చెప్పింది . దీంతో బాలిక తండ్రి పోలీసులకు కంప్లైంట్ చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+