వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైద్యారోగ్య శాఖలో 1,326పోస్టుల భర్తీ.. నోటిఫికేషన్ విడుదలకు మంత్రి హరీష్ రావు ఆదేశాలు

|
Google Oneindia TeluguNews

నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖలో పోస్టుల భర్తీకి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయాలని మెడికల్ బోర్డుకు ఆర్థిక శాఖ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆదేశించారు. ఈమేరకు అధికారులతో మంత్రి సమీక్ష సమావేశాన్ని నిర్వహించి దిశానిర్దేశం చేశారు.

త్వరలో వైద్యారోగ్య శాఖలో 1,326 పోస్టులకు నోటిఫికేషన్

త్వరలో వైద్యారోగ్య శాఖలో 1,326 పోస్టులకు నోటిఫికేషన్

తొలివిడతగా తెలంగాణ వైద్యారోగ్య శాఖలో 1,326 పోస్టులకు నోటిఫికేషన్ ఒకటి రెండు రోజుల్లో విడుదల చేయాలని సూచించారు. ఆ తర్వాత స్టాఫ్ నర్సుల నియామకం జరగనుంది. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో 12,755 ఉద్యోగాల కోసం ఇస్తున్న మొదటి అధికారిక ప్రకటన. మరో రెండు, మూడు వారాల్లో దశల వారీగా మిగిలిన ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల కానుంది.

న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా నోటిఫికేషన్ ఇవ్వాలన్న మంత్రి

న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా నోటిఫికేషన్ ఇవ్వాలన్న మంత్రి

తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి సోమవారం ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ), వెనుకబడిన తరగతులు (బీసీ) రిజర్వేషన్లను అనుసరించాలని, ఎటువంటి చట్టపరమైన ఇబ్బందులు తలెత్తకుండా నోటిఫికేషన్లపై పనిచేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. మొత్తం 12,755 పోస్టులను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేస్తారు.

కరోనా వారియర్స్ గా సేవలందించిన వారికి మార్కుల్లో 20% వెయిటేజీ

కరోనా వారియర్స్ గా సేవలందించిన వారికి మార్కుల్లో 20% వెయిటేజీ

కోవిడ్ మహమ్మారి సమయంలో సేవలను అందించిన ఔట్ సోర్సింగ్ సిబ్బందికి 1,326 ఉద్యోగాల ఎంపికలో 20% వెయిటేజీ మార్కులు కేటాయించబడతాయి. మిగిలిన 80% మార్కులు ఎంబీబీఎస్ కోర్సులో వారి స్కోర్ ఆధారంగా ఉంటాయి. 1,326 పోస్టులు తెలంగాణ వైద్య విద్యా పరిషత్, పబ్లిక్ హెల్త్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ వింగ్స్ మరియు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్‌లో ఉన్నాయి. ఇక ఈ పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుంది.

పోస్టుల భర్తీ పై కీలక ఆదేశాలు

పోస్టుల భర్తీ పై కీలక ఆదేశాలు

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ద్వారా టెక్నికల్, ల్యాబ్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో ఖాళీలను నిమ్స్ బోర్డు ద్వారా భర్తీ చేయాలని, మిగిలిన పోస్టులు, ఆయుష్ విభాగంలోని పోస్టులను భర్తీ చేయాలని హరీశ్ రావు మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ అధికారులను ఆదేశించారు. స్టాఫ్ నర్సులను రిక్రూట్ చేయడానికి కూడా ఆప్షన్ విధానంలో వ్రాత పరీక్ష నిర్వహిస్తారు .

English summary
Minister Harish Rao has directed the Medical Board to issue a notification soon to 1,326 posts in the health department.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X