ఆ ఇంట్లో లక్ష్మీదేవి పుట్టింది.. 10 నెలల వయసులోనే..!
సాధారణంగా ఆడపిల్లను ఇంటి లక్ష్మీదేవి అని పిలుస్తుంటారు. ఎందుకంటే వాళ్లు ఇంట్లోకి అదృష్టం, ఐశ్వర్యం, ఆనందాన్ని తీసుకొస్తారని నమ్ముతారు. లక్ష్మీదేవి అందానికి, శ్రేయస్సుకు ప్రతిరూపం కాబట్టి, ఆడపిల్లలను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ఇంట్లో ఆడపిల్ల ఉండటం ఆ ఇంటికి శుభకరమని.. వారితో ఆ ఇల్లు కళకళలాడుతుందని అనేకమంది భావిస్తుంటారు. ఈ విషయాల్ని నిజం చేసింది ఓ 10 నెలల చిన్నారి. తాజాగా ఓ లాటరీలో 10 నెలల చిన్నారిని అదృష్టం వరించింది. లక్కీ డ్రాలో రూ. 500 లకే ఏకంగా రూ. 16 లక్షల విలువైన ప్లాట్ ను గెలుచుకుంది. దీంతో ఆ ఇంట్లో లక్ష్మీదేవి పుట్టిందని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
పుట్టిన 10 నెలలకే ఆ చిన్నారి.. ఇంటికి కొండంత సంతోషాన్ని తీసుకొచ్చింది. దీంతో ఆ తండ్రి సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో లక్కీ డ్రా నిర్వహించారు. అందులో రూ. 500 లకే ఓ కుటుంబం రూ. 16 లక్షల విలువైన స్థలాన్ని సొంతం చేసుకుంది. కంచర్ల రామ్ బ్రహ్మచారి అనే వ్యక్తి తనకున్న 66 గజాల ప్లాటు అమ్మకానికి లక్కీడ్రా పద్ధతి నిర్వహించాడు. ఈమేరకు 3 వేల కూపన్లు ముద్రించాడు. నవంబరు 2న లక్కీ డ్రా తీస్తానని ప్రకటించాడు.

అయితే ఈ సమాచారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సంగారెడ్డి జిల్లా శంకర్ పల్లికి చెందిన శంకర్ అనే వ్యక్తి తన ఫ్యామిలీ పేరుతో నాలుగు కూపన్లు తీసుకున్నాడు. అయితే 2307 అనే నంబర్ తో కుమార్తె హన్సిక కు ఈ బహుమతి దక్కడంతో ఆ కుటుబంలో సంతోషం వెల్లివిరిసింది. రూ. 500 లకే ప్లాటు దక్కడంపై వారు ఆనందాన్ని వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications