దారుణం: మాయమాటలు చెప్పి పదేళ్ల బాలికపై రేప్, హత్య

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్‌: పదేళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేసి, ఆ తర్వాత దారుణంగా హత్యచేశాడు. సికింద్రాబాద్‌ బొల్లారం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

వివరాల్లోకి వెళితే.. బొల్లారం కలాసిగూడకు చెందిన రామకృష్ణ దంపతులు శనివారం కూలికి వెళ్లగా కూతురు ఒక్కతే ఇంట్లో ఉంది. అది గమనించిన అదే ప్రాంతానికి చెందిన అనిల్‌కుమార్‌ ఇంటి ముందు ఉన్న బాలికకు మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.

ఘటన బయటకు వస్తుందనే నెపంతో బాలికను గొంతు నులిమి హత్యచేశాడు అనిల్‌కుమార్‌. నిర్మానుష్య ప్రాంతంలో విగతజీవిగా ఉన్న బాలికను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమందించారు.

బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు బొల్లారం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. కాగా, నిందితుడు అనిల్‌పై బొల్లారం స్టేషన్‌తో పాటు, పలు పోలీస్‌స్టేషన్‌లలో కేసులు ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

 10 Year old Girl Raped and Murdered in Secunderabad

బస్సు చక్రాల కిందపడి వ్యక్తి మృతి

ఆర్టీసీ బస్సు చక్రాల కింద పడి ఓ వ్యక్తి దుర్మరణం పాలైన సంఘటన బోయిన్‌పల్లి పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన శ్రీనివాస్‌రావు(32) ఏడేళ్ల క్రితం బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి, భార్య సక్కుబాయి ఇద్దరు పిల్లలతో కలిసి షాపూర్‌నగర్ సంజయ్‌గాంధీనగర్‌లో నివాసం ఉంటున్నాడు.

కొన్నేళ్లపాటు 104 వాహనం కాల్ సెంటర్‌లో పనిచేశాడు. ప్రస్తుతం ముషీరాబాద్‌లోని ప్రియా ఔట్‌లెట్‌లో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు. శనివారం ఉదయం ఇంట్లో నుంచి తన బైక్‌పై ఆఫీస్‌కు బయలుదేరాడు. సుచిత్ర నుంచి బోయిన్‌పల్లిలోని టాటా మోటర్స్ వద్దకు చేరుకోగానే బారికేడ్లు అడ్డుగా రావడంతో అదుపు తప్పి పక్కనే వెళుతున్న మేడ్చల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వెనుక చక్రాల కింద పడ్డాడు.

ఘటన సమయంలో శ్రీనివాస్ తలకు హెల్మెట్ ధరించినా బస్సు చక్రాలు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని గాంధీ మార్చూరికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ నాయక్‌ను అరెస్ట్ చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
10 Year old Girl Raped and Murdered in Secunderabad.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి