రికార్డు వరదను తట్టుకుని నిలబడి..! 103 ఏళ్ల నాటి పోచారం ప్రాజెక్టు ఇంజనీరింగ్ సీక్రెట్!

కామారెడ్డి జిల్లాను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఈ క్రమంలో భారీ వరదలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో పోచారం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టు పూర్తిగా నిండిపోవడం, వరద నియంత్రణ సాధ్యం కాకపోవడంతో ఆందోళన నెలకొంది. ఊహించిన దానికి కంటే పోచారం ప్రాజెక్టు పైనుంచి నీరు ధాటిగా ప్రవహిస్తూ వెళ్లింది. ఈ క్రమంలోనే పోచారం ప్రాజెక్ట్ పక్కన గుంతపడటంతో ప్రాజెక్టు తెగిపోయే అవకాశం ఉందని భయాందోళనలు నెలకొన్నాయి. స్థానికంగా ఉన్న గ్రామాల ప్రజలు కూడా గజగజ వణికిపోయారు. కానీ ఈ ప్రాజెక్టు భారీ వరదను కూడా తట్టుకుని నిలబడింది. 103 ఏళ్ల క్రితం నిర్మించిన పోచారం ప్రాజెక్టు అంతటి వరదను సైతం తట్టుకుని ఇంజనీరింగ్ అద్భుతంగా నిలిచింది. ప్రాజెక్టు ఎలాంటి ప్రమాదానికి గురికాకుండా ఉందని.. ఎలాంటి ఇబ్బంది లేదని నీటిపారుదల శాఖ ప్రకటించింది. ఈ ఇంజనీరింగ్ అద్భుతం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

తెలంగాణలోనే.. నిజాం కాలంలో నిర్మించిన పురాతన ప్రాజెక్టులలో పోచారం ప్రాజెక్ట్ ఒకటి. ఇది సంభవించిన భారీ వరద ప్రవాహాన్ని విజయవంతంగా తట్టుకుని నిలిచింది. ఈ ప్రాజెక్టు గరిష్ట వరద ప్రవాహ సామర్థ్యం (MFD) 70,000 క్యూసెక్కులు మాత్రమే అయినప్పటికీ, ఇటీవల వచ్చిన 1,82,000 క్యూసెక్కుల భారీ వరదను ఇది తట్టుకోగలిగింది. ఈ అపారమైన ఒత్తిడిని సైతం తట్టుకొని ప్రాజెక్ట్ సురక్షితంగా ఉండటం నీటిపారుదల నిపుణులకు, ప్రభుత్వ వర్గాలకు గొప్ప ఉపశమనం కలిగించింది. ఒక శతాబ్దానికి పైగా బలంగా నిలబడిన ఈ కట్టడం, ఆనాటి ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిలువెత్తు నిదర్శనం.

103-Year-Old Pocharam Project Withstands Record Floods A Timeless Engineering Marvel

పోచారం ప్రాజెక్ట్ చారిత్రక, సాంకేతిక వివరాలు
నిజాం ప్రభుత్వం నిర్మించిన తొలి ప్రాజెక్టులలో ఒకటిగా పోచారం ప్రాజెక్ట్ చరిత్రలో నిలిచిపోయింది. దీని నిర్మాణం 1917లో ప్రారంభమై, 1922లో పూర్తయింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అప్పటి విలువ ప్రకారం రూ. 27.11 లక్షలు ఖర్చు చేశారు. ఈ ప్రాజెక్ట్ కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డిపేట మండలం, పోచారం గ్రామంలో ఉన్న మంచిప్ప చెరువుపై నిర్మించారు. దీని అసలు సామర్థ్యం 2.423 టీఎంసీలు. అయితే, కాలక్రమేణా పూడిక కారణంగా దాని ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 1.82 టీఎంసీలకు తగ్గింది. ఈ ప్రాజెక్ట్ కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాలు, మెదక్ జిల్లాలోని మెదక్ మండలాలకు సాగునీరు, తాగునీటి అవసరాలను తీరుస్తోంది. దీని కింద మొత్తం 10,500 ఎకరాలకు పైగా భూమి సాగులోకి వస్తోంది.

ఈ ప్రాజెక్టు నిర్మాణంలో సున్నపురాయిని ఉపయోగించారు. దీని పొడవు 1.7 కిలోమీటర్లు, కట్ట ఎత్తు 21 అడుగులు. దీని కింద ఉన్న పంట పొలాలకు నీరు అందించడానికి 58 కిలోమీటర్ల పొడవైన ప్రధాన కాలువలతో పాటు 73 డిస్ట్రిబ్యూటరీలను నిర్మించారు. ఈ డిస్ట్రిబ్యూటరీలను కూడా రెండు జోన్‌లుగా విభజించారు: 'A' జోన్ (1 నుంచి 48 డిస్ట్రిబ్యూటరీలు), 'B' జోన్ (49 నుండి 73 డిస్ట్రిబ్యూటరీలు). 103 సంవత్సరాలు గడిచినా, ఈ ప్రాజెక్ట్ ఇప్పటికీ వేల ఎకరాల భూమికి జీవనాధారంగా నిలబడటంతో, ఆ నాటి నిర్మాణ నాణ్యత, ఇంజనీరింగ్ నైపుణ్యానికి ఇది ఒక గొప్ప సాక్ష్యంగా నిలిచింది. అంతే కాకుండా ఇంతటి భారీ వరదను తట్టుకుని నిలబడి నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి , మెదక్ ప్రాంతాలు వరదలో కొట్టుకుపోకుండా కాపాడింది.

మరి ఇంతటి ప్రాచీన ప్రాజెక్టులకు కనీస మెయింటెనెన్స్ కూడా చేయలేకపోతున్నాయి ప్రభుత్వాలు. వాటి పర్యవసానాలే ఈ భారీ వరద. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని పూడిక తీయడంతో పాటు.. ప్రాజెక్టుల నిర్వహణపై కూడా దృష్టి సారించాలని ప్రజలు వేడుకుంటున్నారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+