పట్టేశారు: 24 గంటల్లో వీడిన 12 లక్షల దోపిడీ మిస్టరీ (ఫోటోలు)
హైదరాబాద్: నగరంలోని సుల్తాన్ బజార్‌లో షాప్ మూసి ఇంటికి నగదుపై బైక్‌పై వెళ్తోన్న వ్యాపారిని మరో ద్విచక్రవాహనంతో ఢీకొట్టి రూ. 12 లక్షలు ఎత్తుకెళ్లిన నిందితుల్లో ఐదుగురిని 24 గంటల్లోపే సుల్తాన్ బజార్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 10.7 లక్షలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ దోపిడీలో మొత్తం ఏడుగురి ప్రమేయం ఉండగా మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. ఆదివారం సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్‌లో తూర్పు మండలం డీసీపీ డాక్టర్ రవీందర్, టాస్క్ ఫోర్స్ డీసీపీ లింబారెడ్డి, సుల్తాన్ బజార్ ఏసీపీ రావుల గిరిధర్‌తో కలిసి కేసు వివరాలను వెల్లడించారు.
రాంకోఠికి చెందిన దివ్వేష్ హడియా సిద్ధి అంబర్ బజార్‌లో రాజధాని టైర్స్ పేరిట వ్యాపారం నిర్వహిస్తున్నారు. అతడి ఎదురుగా ఉన్న దుకాణంలో జగదీష్ సింగ్ అనే యువకుడు పని చేసేవాడు. అయితే దివ్వేష్ హడియా తన దుకాణంలో పని వారు లేనప్పుడు జగదీష్ సింగ్‌ను పిలచి పని చేయించుకునేవారు.
ఈ నేపథ్యంలో జగదీష్ సింగ్ అతడి దుకాణంలో పెద్ద ఎత్తున నగదు ఉండడాన్ని గమనించి, మంగళ్ హాట్‌కు చెందిన అశీశ్ సింగ్ (20)తో కలిసి దోపిడీ ప్లాన్ వేశాడు. దీనికి బాలాపూర్ ఇందిరానగర్‌కు చెందిన మల్లిఖార్జున్ (22) సహకారాన్ని కోరారు. దీంతో అతడు తన స్నేహితులు అలియాబాద్‌కు చెందిన మహ్మాద్ అమీర్ (22), మంగళ్ హాట్‌కు చెందిన రాజామిశ్రాలను కూడా పిలిపించాడు.
వీరంతా అబిడ్స్‌లోని గ్రాండ్ హోటల్‌లో కలుసుకుని దివ్వేష్ హడియా ఇంటికి వెళ్లే సమయంలో దోపిడీ చేయాలని నిర్ణయించారు. ముందుగా ఈ నెల 11నే దోపిడీకి ప్లాన్ వేసినప్పిటికీ దివ్వేష్ ఆరోజు ముందుగానే ఇంటికి వెళ్లడంతో ప్లాన్‌ను వాయిదా వేశారు.

24 గంటల్లో వీడిన 12 లక్షల దోపిడీ మిస్టరీ
అనంతరం బాలాపూర్‌కు చెందిన మహ్మాద్ అబీబ్ (20), జల్ పల్లికి చెందిన అసీఫ్‌ను కూడా తమతో కలుపుకుని ఈ నెల 18న అబిడ్స్‌లోని గ్రాండ్ హోటల్‌లో మళ్లీ కలుసుకుని దివ్వేష్ హడియా రాకకోసం ఎదురు చూశారు. అతన తన హోండా యాక్టివా వాహనంపై రావడాన్ని గమనించారు.

24 గంటల్లో వీడిన 12 లక్షల దోపిడీ మిస్టరీ
అనంతరం తిలక్ రోడ్డులోని ఆదిత్యా హాస్పిటల్ వరకు జగదీశ్ సింగ్ కాకుండా మిగిలిన ఆరుగురు మాడు బైక్‌లపై వెంబడించారు. రోడ్డుపై రద్దీ తక్కువగా ఉన్న చోట అదను చూసి మల్లికార్జున్ తన వాహనంతో దివ్వేష్ హడియా బైక్‌ను ఢీ కొట్టాడు.

24 గంటల్లో వీడిన 12 లక్షల దోపిడీ మిస్టరీ
దీంతో వ్యాపారి దినేష్ సింగ్ బైక్ పైనుంచి కిందపడిపోగా దోపిడీ దొంగలు క్యాష్ బ్యాగ్ తీసుకుని బాలాపూర్ చేరుకున్నాడు. ఆదివారం ఉదయం జగదీష్ సింగ్ బాలాపూర్ చేరుకుని అందరూ అక్కడ నగదు పంచుకున్నారు. బాధితుడు సుల్తాన్ బజార్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

24 గంటల్లో వీడిన 12 లక్షల దోపిడీ మిస్టరీ
సమాచారం అందుకున్న పోలీసులు ఆదివారం బాలాపూర్ చేరుకుని దోపిడీకి పాల్పడిన ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 10.7 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. కుల్సుంపురాకు చెందిన మల్లికార్జున్, జల్‌పల్లికి చెందిన హబీబ్ పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్న ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నట్టు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications