సైబరాబాద్ కమీషనరేట్ పరిధిలో మరో 12కొత్త పోలీస్ స్టేషన్లు; ప్రభుత్వానికి ప్రతిపాదనల వెనుక కారణమిదే!!
విశ్వ నగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ లో శాంతి భద్రతల పరిరక్షణ కోసం తెలంగాణ పోలీసులు శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటైన హైదరాబాద్ నగరంలో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధి విస్తృతంగా ఉంది. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మరో 12 కొత్త పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని పోలీసు ఉన్నతాధికారులు ప్రతిపాదించినట్లు సమాచారం.

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 12 కొత్త పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు
మొత్తం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధి మూడు వేల ఆరు వందల నలభై నాలుగు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. మొత్తం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 29 రెవిన్యూ మండలాలు, మూడు లా అండ్ ఆర్డర్ జోన్లు, 9 లా అండ్ ఆర్డర్ డివిజన్లు, 36 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఇక సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు ఈ పోలీసులు సరిపోవడం లేదని భావించిన పోలీసు ఉన్నతాధికారులు సైబరాబాద్ కు మరో 12 కొత్త పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.

ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన పోలీస్ శాఖ
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న జనాభాను, విస్తీర్ణాన్ని, అక్కడ జరుగుతున్న నేరాల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని, వివిధ అంశాలను క్రోడీకరించి ప్రస్తుతమున్న కొన్ని పోలీస్ స్టేషన్లను విభజించి, అదనంగా కొన్ని ప్రాంతాలను చర్చి కొత్త పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడానికి కసరత్తు చేస్తున్నారు. ఇక ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు జాబితాను కూడా నివేదించినట్లు గా తెలుస్తుంది.

హైదరబాద్ లో పెరుగుతున్న నేరాలను కంట్రోల్ చెయ్యటంపై ఫోకస్
ఇదిలా ఉంటే సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే కాకుండా, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కూడా కొత్త పోలీస్ స్టేషన్ ల ప్రతిపాదనలు వచ్చినట్టు సమాచారం. ఇదిలా ఉంటే ఇటీవలే ప్రపంచ స్థాయి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, మౌలిక వసతులతో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. పోలీసు శాఖకు సంబంధించిన అన్ని విభాగాలు ఒకే చోట నుంచి పనిచేసేలా కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. ఇక తాజాగా హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న నేరాలను దృష్టిలో పెట్టుకొని కొత్త పోలీస్ స్టేషన్ ల ఏర్పాటు పైన కూడా దృష్టి సారిస్తున్నారు.












Click it and Unblock the Notifications