తెలుగు సినిమా ఇండస్ట్రీ మూత పడింది..!

తెలుగు సినిమా పరిశ్రమలో ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. 24 క్రాఫ్ట్స్ నేతలు చేపట్టిన బంద్‌కు మద్దతుగా, ఫిలిం ఛాంబర్ సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎలాంటి సినిమా షూటింగులు జరపకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయంతో టాలీవుడ్ ఒక్కసారిగా స్తంభించిపోయింది.

ఫిలిం ఛాంబర్ సెక్రటరీ దామోదర ప్రసాద్ జారీ చేసిన ఈ ఆదేశాలు పరిశ్రమలో చర్చనీయాంశమయ్యాయి. చాంబర్ నుంచి అనుమతి లేకుండా ఏ సినిమా షూటింగ్‌ను కూడా నిర్వహించవద్దని స్పష్టంగా పేర్కొన్నారు. ఈ నిబంధనలు ఔట్ డోర్ షూటింగ్‌లకు మాత్రమే కాకుండా, స్టూడియోల్లో జరిగే షూటింగ్‌లకు కూడా వర్తిస్తాయని తెలిపారు.

24 Crafts Call for Bandh Telugu Film Industry Comes to a Standstill

24 క్రాఫ్ట్స్ నేతలు తమ డిమాండ్ల సాధన కోసం బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో, చిత్ర పరిశ్రమలోని అన్ని విభాగాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘించి షూటింగ్‌లు నిర్వహిస్తే, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఫిలిం ఛాంబర్ హెచ్చరించింది.

ఈ నిర్ణయంతో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న పలు పెద్ద సినిమాల షూటింగ్‌లు నిలిచిపోనున్నాయి. ఇది చిత్ర పరిశ్రమపై ఎలాంటి ప్రభావం చూపుతుందో, ఈ సమస్య ఎప్పుడు పరిష్కారమవుతుందోనని నిర్మాతలు, దర్శకులు, నటీనటులు ఆందోళన చెందుతున్నారు. ఈ బంద్‌తో వేలాది మంది కార్మికులు, సాంకేతిక నిపుణులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని సినీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+