వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వరద నష్టపరిహారం 25వేలు; టీఆర్ఎస్ పార్టీ ఖాతానుండి ఇవ్వాలి: వైఎస్ షర్మిల డిమాండ్

|
Google Oneindia TeluguNews

వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. వరద ముంపుకు గురైన ఆదిలాబాద్ జిల్లా, పెద్దపల్లి జిల్లాలలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన షర్మిల, వరద బాధితుల పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. వరద ముంపుకు గురైన ప్రాంతాలలో ఆస్తి నష్టం గురించి బాధితులతో మాట్లాడారు. ఆపై తెలంగాణ సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు వైయస్ షర్మిల.

కేసీఆర్.. భారీవరదల వల్ల కాళేశ్వరం మునిగితే, దేవాదుల ఎందుకు మునగలేదు: వైఎస్ షర్మిల సూటిప్రశ్నకేసీఆర్.. భారీవరదల వల్ల కాళేశ్వరం మునిగితే, దేవాదుల ఎందుకు మునగలేదు: వైఎస్ షర్మిల సూటిప్రశ్న

వరద ప్రభావిత ప్రాంతాలలో వైఎస్ షర్మిల పర్యటన

వరద ప్రభావిత ప్రాంతాలలో వైఎస్ షర్మిల పర్యటన


నిన్న మంచిర్యాల పట్టణంలోని ఎన్టీఆర్ నగర్లో వరదకు దెబ్బతిన్న ప్రతి కుటుంబానికి ఐదు వేల రూపాయల తక్షణ సహాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందిస్తామని పేర్కొన్న వైయస్ షర్మిల, నేడు పెద్దపల్లి జిల్లా రామగుండం లో వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. అక్కడ బాధితులు వైఎస్ షర్మిలను చూసి తమను పట్టించుకునే వారు లేరని కన్నీరుమున్నీరయ్యారు. ప్రభుత్వం సహాయం అందిస్తామని చెబుతున్నా ఇప్పటివరకు ఎటువంటి సహాయం తమకు అందలేదని వారి వైయస్ షర్మిల దృష్టికి తీసుకువచ్చారు.

 అవగాహన లేకుండా ప్రాజెక్ట్ లు కట్టి వరదలకు కారణమైన కేసీఆర్

అవగాహన లేకుండా ప్రాజెక్ట్ లు కట్టి వరదలకు కారణమైన కేసీఆర్


ఈ క్రమంలో షర్మిల తెలంగాణ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వరదలతో అనేక ప్రాంతాలు ముంపునకు గురి కావడానికి సీఎం కేసీఆర్ వైఫల్యమే కారణం అంటూ షర్మిల మండిపడ్డారు. అవగాహన లేకుండా ప్రాజెక్టులు కట్టి ప్రజలకు ఇటువంటి పరిస్థితిని తీసుకువచ్చారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు వరదలతో సర్వం కోల్పోయారని, పంట నష్టపరిహారం ఇస్తామని అది కూడా ఇవ్వకుండా మోసం చేస్తున్నారంటూ షర్మిల మండిపడ్డారు. ఇప్పటివరకు పంట నష్టపరిహారం ఎందుకు ఇవ్వలేదంటూ వైయస్ షర్మిల కెసిఆర్ ను ప్రశ్నించారు.

వరద బాధితులకు 25 వేల పంట నష్టపరిహారం ఇవ్వాలి

వరద బాధితులకు 25 వేల పంట నష్టపరిహారం ఇవ్వాలి


ఇక వరద బాధితులకు నష్టపరిహారం పది వేలు కాదు, 25 వేలు ఇవ్వాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు .వరదలు వస్తాయి అని తెలిసినా, వరద ముంపు ప్రాంతాలపై ప్రభుత్వం పట్టనట్టుగా వ్యవహరించిందని షర్మిల మండిపడ్డారు. ప్రభుత్వ ఖజానా నుండి కాకుండా టిఆర్ఎస్ పార్టీ అకౌంట్ నుండి నష్టపరిహారం అందించాలని వైయస్ షర్మిల డిమాండ్ చేశారు. టిఆర్ఎస్ పార్టీ అకౌంట్ లో 860 కోట్ల రూపాయలు ఉన్నాయని ప్రతి నెలా వడ్డీ కింద మూడు కోట్ల రూపాయలు వస్తుందని కెసిఆర్ చెబుతున్నాడని పేర్కొన్న షర్మిల, టిఆర్ఎస్ పార్టీ అకౌంట్ నుండి ప్రజలకు నష్టపరిహారం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టు పంప హౌస్ లు కాపాడుకోలేని కేసీఆర్

కాళేశ్వరం ప్రాజెక్టు పంప హౌస్ లు కాపాడుకోలేని కేసీఆర్


కడెం ప్రాజెక్టు గేట్లు మరమ్మతులు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని, మూడేళ్ల నుండి గేట్లు మార్చాలని చెబుతున్న కేసీఆర్ పట్టించుకోలేదని, ఇక గేట్లను మేనేజ్ చేసే సిబ్బంది 33 మంది ఉండాల్సిన చోట కేవలం ముగ్గురే ఉన్నారని వైయస్ షర్మిల ఆరోపించారు. లక్షల కోట్ల పెట్టుబడి పెట్టి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పంప్ హౌస్ లను కూడా కాపాడుకో లేని పరిస్థితిలో సీఎం కేసీఆర్ ఉన్నారంటూ వైఎస్ షర్మిల విమర్శించారు. కెసీఆర్ అవినీతికి, అక్రమాలకూ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు.

కాళేశ్వరం బ్యాక్ వాటర్ కారణంగా వేలాది ఎకరాలు నీట మునక

కాళేశ్వరం బ్యాక్ వాటర్ కారణంగా వేలాది ఎకరాలు నీట మునక

కాళేశ్వరం ప్రాజెక్టు లో ఇప్పటివరకు ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదని, కానీ కాళేశ్వరం బ్యాక్ వాటర్ ప్రభావంతో వేల ఎకరాల పంట నష్టం జరిగిందంటూ వైయస్ షర్మిల మండిపడ్డారు. ఇప్పటికైనా కెసిఆర్ మత్తు నిద్ర వీడి తక్షణం వరద బాధితులకు 25 వేల రూపాయల పరిహారం అందించాలని వైయస్ షర్మిల పేర్కొన్నారు.

English summary
YS Sharmila, visiting the flood affected areas, demanded 25,000 as flood compensation and that too from the TRS party account. It was because of KCR's failure that the floods submerged the villages.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X