కోట్ల మోసం: వీఆర్ఆర్ కన్‌స్ట్రక్చన్ ఎండీ నగనూరి రాజేష్ అరెస్ట్
హైదరాబాద్: ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ వీఆర్ఆర్ కన్‌స్ట్రక్చన్ ఎండీ నగునూరి రాజేష్‌ను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రజల నుంచి దాదాపు రూ. 24 కోట్లు వసూలు చేసి పరారైన రాజేష్‌ను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. అధిక మొత్తంలో వడ్డీలు ఇస్తానంటూ వందల మంది నుంచి ప్లాట్లు, డిపాజిట్ల పేరుతో రాజేష్ డబ్బులు వసూలు చేసి పరారయ్యాడు.
ఈ క్రమంలో తాము మోసపోయినట్లు గ్రహించిన బాధితులు హైదరాబాద్ సీపీని ఆశ్రయించారు. తమ నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి మోసం చేశాడని నగనూరి రాజేష్ పై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి రాజేష్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే శుక్రవారం రాజేష్‌ను పోలీసులు పట్టుకున్నారు. పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు.

ఆన్‌లైన్ యాప్ పరిచయంతో రూ. 7.50 లక్షలు దోచేశాడు
ఆన్‌లైన్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు చెబుతున్నా.. ఇలాంటి మోసాలకు గురయ్యేవారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు. తాజాగా హనుమకొండ, మంచిర్యాల జిల్లాల్లో ఈ తరహా ఘటనలే జరిగాయి. ఓ మహిళను నమ్మించి ఆన్‌లైన్ యాప్ ద్వారా రూ.7.50 లక్షల నగదును హైదరాబాద్‌కు చెందిన యువకుడు తన ఖాతాలోకి బదిలీ చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
హనుమకొండ గాంధీనగర్‌కు చెందిన మహిళ ప్రైవేటు ఉద్యోగం చేస్తూ బ్యాంక్ ఖాతాలో కుటుంబ అవసరాల కోసం డబ్బులు దాచుకుంటుంది. ఈ క్రమంలో 'నీతో' యాప్ ద్వారా హైదరాబాద్‌కు చెందిన వసంత్ పరిచయం అయ్యాడు. ఇలా వారివురు వాట్సప్ ఛాటింగ్ చేసుకుంటూ ఉన్నారు. తనకు ఎవరూ లేరని ఒంటరిగా ఉంటున్నానని ఆమెను వసంత్ నమ్మించసాగాడు. అదే విధంగా తనకు డబ్బులు అవసరం ఉందని చెప్పాడు. ఆ డబ్బులు ఇవ్వకుంటే చనిపోతానని మహిళను బ్లాక్ మెయిల్ చేశాడు.
అయితే, అతడి మాటలు నమ్మిన ఆమె అవసరం ఏమోనని తొలిసారి రూ.25 వేలు డబ్బును అతని ఖాతాకు పంపించింది. ఇంకా, కావాలంటే దశలవారీగా ఆరు నెలలో రూ.7.50 లక్షలు పంపించింది. తాను ఇచ్చిన డబ్బులు తిరిగి చెల్లించాలని ఆమె అతడిపై ఒత్తిడి తేవడంతో వసంత్ మొబైల్‌ను స్వీచ్ ఆఫ్ చేసేశాడు. చివరి ఆమె చేసేదేమీ లేక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఇలా సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తులకు డబ్బులు పంపించవద్దని పోలీసులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications