ఘోరం: రైలు ఢీకొని 400 గొర్రెలు మృతి(వీడియో)
జిల్లాలోని రామన్నపేట వద్ద రైల్వే ట్రాక్‌పై ఘోరం జరిగింది. రైలు ఢీకొని దాదాపు 400 గొర్రెలు మృతి చెందాయి. దీంతో గొర్రెల కాపరి బోరున విలపించాడు.
యాదాద్రి భువనగిరి: జిల్లాలోని రామన్నపేట వద్ద రైల్వే ట్రాక్‌పై ఘోరం జరిగింది. రైలు ఢీకొని దాదాపు 400 గొర్రెలు మృతి చెందాయి. దీంతో గొర్రెల కాపరి బోరున విలపించాడు.
గొర్రెల మంద ట్రాక్‌ను దాటుతున్న సమయంలో ఒక్కసారిగా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలు దూసుకురావడంతో రావడంతో ఈ ఘోరం చోటుచేసుకుందని రైల్వే అధికారులు తెలిపారు. ట్రాక్ వెంబడి చెల్లాచెదురుగా పడి ఉన్న గొర్రెలను చూసి గొర్రెల కాపరి హతాశుడయ్యాడు.
గొర్రెల మరణంతో భారీ ఆస్తినష్టం సంభవించిందని వాపోయాడు. దాదాపు రూ.10 లక్షల కంటే ఎక్కువే నష్టం జరిగిందని, తనను ఆదుకోవాలని గొర్రెల కాపరి వేడుకుంటున్నాడు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications