వర్షంలోనే ఏడో రోజూ కొనసాగుతున్న విద్యార్థుల నిరసన: బాసర ట్రిపుల్ ఐటీకి మంత్రి సబిత

ఆదిలాబాద్: తమ సమస్యలు పరిష్కరించాలంటూ నిర్మల్ జిల్లాలోని బాసర ఆర్జీయూకేటీలో విద్యార్థులు చేపట్టిన నిరసన ఏడవ రోజుకు చేరింది. కొన్ని రోజులుగా ఎండలోలోనే నిరసనలు తెలిపిన విద్యార్థులు ఇప్పుడు.. వర్షంలోనూ తమ ఆందోళనలను కొనసాగిస్తున్నారు. సోమవారం కూడా వర్షంలోనే తడుస్తూ ట్రిపుల్ ఐటీ ప్రధాన గేటు వద్ద విద్యార్థులు కూర్చున్నారు.

డిమాండ్లపై ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఒక వివరణ, లేదా విద్యాశాఖ మంత్రి సబితా ఇందరారెడ్డి రాతపూర్వక హామీ ఇస్తే ఆందోళన విరమిస్తామని విద్యార్థులు చెబుతున్నారు. న్యాయమైన తమ 12 డిమాండ్లను నెరవేర్చాలని స్పష్టం చేస్తున్నారు విద్యార్థులు. తాము గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని.. అవసరమైనవే కోరుతున్నామన్నారు.

7th day continues basara iiit students protest: minister sabitha indra reddy will reach basara today

కాగా, ఆర్జీయూకేటీ డైరెక్టర్ సతీష్ కుమార్, నిర్మల్ జిల్లా కలెక్టర్ ఫారూకీ ఆదివారం అర్ధరాత్రి క్యాంపస్‌కు చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు చర్చలు జరిపారు. ప్రభుత్వం అన్ని విధాలుగా సాయం చేసేందుకు సిద్ధంగా ఉందని, అన్ని సమస్యలను పరిష్కరిస్తుందని అధికారులు విద్యార్థులకు చెప్పారు.

అయితే, అదే మాట సీఎంవో, మంత్రులతో చెప్పించాలని విద్యార్థులు అధికారులను కోరారు. అర్ధరాత్రి చర్చలు జరిగినా.. ఇంత వరకు మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి లేదా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టమైన హామీ రాకపోవడంతో విద్యార్థులు తమ ఆందోళనలను కొనసాగిస్తున్నారు. విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును నిర్వహిస్తున్నారు. ఇతరులను గేటు నుంచి లొపలికి వెళ్లేందుకు అనుమతించడం లేదు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా గేటు ముందు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నేడు బాసరకు సబితా ఇంద్రారెడ్డి

ఏడు రోజులుగా తమ సమస్యల పరిష్కారం కోసం నిరసన చేస్తుండగా.. ఎట్టకేలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం బాసరకు వెళ్లి విద్యార్థులకు భరోసా ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. సంబంధిత అధికారులతో మంత్రి సబిత బాసరకు బయల్దేరుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+