తెలంగాణలో 90 శాతం, యూపీలో 1.12 లక్షల మసీదులకు యాజమాన్య పత్రాల్లేవు!
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకొస్తున్న వక్ఫ్ సవరణ బిల్లును తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ.. దేశంలోని 90 శాతం మసీదులకు ఎలాంటి యాజమాన్యాన్ని రుజువు చేసే పత్రాలు లేవని తెలిపారు.
వక్ఫ్ బిల్లు సవరణ బిల్లు చట్టంగా మారితే మసీదులు, ఈద్గాలు, ఇతర ముస్లిం మత స్థలాలను లాక్కుంటారని అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. ఒక్కసారి ముస్లింలు ఒక స్థలాన్ని ప్రార్థనా స్థలంగా ఉపయోగించడం ప్రారంభిస్తే, ఆ స్థలం శాశ్వతంగా ముస్లింల ఆస్తిగా మారుతుందని, ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఆ నిబంధనను మారుస్తోందన్నారు.

తెలంగాణలో 33 వేల వక్ఫ్ ఆస్తులు ఉన్నాయని, అందులో 90% వాటికి భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పట్టాలు లేవని అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు. కొందరు మక్కా, మదీనా రిజిస్టర్డ్ డీడ్‌ను అడిగితే అందించగలరా? అని ప్రశ్నించారు. 300-400 సంవత్సరాల క్రితం రిజిస్ట్రేషన్ పత్రాలు లేనందున, ఈ మసీదులను ప్రభుత్వం లాక్కుంటుందని ఒవైసీ పేర్కొన్నారు.
ఇప్పటికే ఒక బాబ్రీ మసీదును పోగొట్టుకున్నామని, ఇప్పుడు 90 శాతం మసీదులను కోల్పోతామని ఒవైసీ అన్నారు. ఖననం చేయబడిన దేవాలయాలను కనుగొనడానికి మసీదులను తవ్వాలని ఆర్ఆర్ఎస్ డిమాండ్ చేస్తుందని ఒవైసీ చెప్పారు.
ఇక, ఉత్తరప్రదేశ్‌లో 1.21 లక్షల వక్ఫ్ ఆస్తులు ఉన్నాయని, వాటిలో 1.12 లక్షలకు ఎలాంటి పత్రాలు లేవని అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. 'వాటి యాజమాన్యం లాక్కుంటే ఆస్తులను ఎవరు స్వాధీనం చేసుకుంటారు?' అని ఒవైసీ ప్రశ్నించారు. 'మీకు మసీదుపై ఎలాంటి చట్టపరమైన హక్కు ఉండదు, ఎవరైనా దానిని స్వాధీనం చేసుకోగలరు' ఒవైసీ పేర్కొన్నారు.
VIDEO | "If this (Waqf) law is approved... out of one lakh and twenty-one thousand Waqf properties in Uttar Pradesh, one lakh and twelve thousand don't have documents. If Waqf by user is removed, who will take the land? If you don't have legal right to the land, anyone can claim… pic.twitter.com/p9ewY5CT52
— Press Trust of India (@PTI_News) September 21, 2024
ఆర్మీ, రైల్వేల తర్వాత వక్ఫ్ బోర్డు భారతదేశంలో మూడవ అతిపెద్ద భూమి యజమాని అని వాదనలకు ప్రతిస్పందించిన ఒవైసీ.. హిందూ దేవాలయాలు, మఠాలకు చాలా ఎక్కువ భూమి ఆస్తులు ఉన్నాయని పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాల్లోని హిందూ దేవాలయాల భూములు కలిపి వక్ఫ్ బోర్డ్ ఆస్తుల కంటే చాలా ఎక్కువగా ఉంటాయని ఆయన అన్నారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా మూడు రాష్ట్రాల్లోని హిందువుల ఆస్తులు వక్ఫ్ ఆస్తుల కంటే ఎక్కువగా ఉన్నాయని ఒవైసీ చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications