సారిక మృతి వెనక రాజయ్య సొంత పార్టీ నేతల కుట్ర?: సిబిఐకి అందిన ఫిర్యాదు
హైదరాబాద్/వరంగల్: వరంగల్ మాజీ ఎంపి సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, ఆమె ముగ్గురు కుమారుల సజీవ దహనం కేసుపై దర్యాప్తు చేపట్టాలంటూ ఓ న్యాయవాది నుంచి సిబిఐకి ఫిర్యాదు అందింది. వరంగల్ పార్లమెంటరీ స్థానం ఉప ఎన్నికల నేపథ్యంలో పోటీచేసేందుకు రాజయ్యకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిన విషయం తెలిసిందే.
నేపథ్యంలో అదేపార్టీకి చెందిన కొందరు నేతలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆమనగల్‌కు చెందిన జి నర్సింహ అనే న్యాయవాది హైదరాబాద్‌లోని సిబిఐ కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
రాజయ్య పోటీచేసేందుకు అధిష్టానం అనుమతించిన తర్వాత, నామినేషన్ దాఖలుకు ముందురోజు రాత్రి జరిగిన ఈ ఘటన వెనుక కుట్రకోణం ఉందని, దీనిపై లోతైన దర్యాప్తు జరపాలని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

అదేపార్టీ నుంచి వరంగల్ ఉపఎన్నికల్లో పోటీచేసేందుకు గట్టి ప్రయత్నాలు చేసిన వ్యక్తిపై అనుమానాలు ఉన్నాయంటూ ఫిర్యాదులో తెలిపినట్లు తెలిసింది. స్థానికత అంశం కారణంగా పోటీచేసేందుకు తనకు బీ-ఫారమ్ రాకుంటే, ఢిల్లీలో తన పలుకుబడిని ఉపయోగించి తన అల్లుడికి టికెట్ ఇప్పించుకోవాలని చూశారని తెలిపారు.
అయితే చివరకు రాజయ్య పేరునే అధిష్ఠానం ఆమోదించడంతో అప్పటిదాకా టికెట్ కోసం ప్రయత్నించిన సదరువ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టే అవకాశం ఉందని అనుమానాలు వ్యక్తం చేశారు. కేసు నుంచి రాజయ్యను రక్షించాలనేది తన ఉద్దేశం కాదని, సారిక, ఆమె కుమారుల మృతి వ్యవహారాన్ని తేల్చేందుకు లోతైన దర్యాప్తు అవసరమని, అందుకు సిబిఐ రంగంలోకి దిగాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
రాజయ్య రాజకీయ జీవితాన్ని అంతంచేసి తనతోపాటుగా తన కుటుంబ ప్రాబల్యం పెంచుకోవాలనుకున్న వ్యక్తి ఈ దారుణానికి ఒడ్డిగట్టే అవకాశం ఉందని న్యాయవాది నర్సింహ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
మాజీ ఎంపి రాజయ్య రిమాండ్ గడువు పొడిగింపు
సారిక, ముగ్గురు కుమారుల సజీవ దహనం కేసులో విచారణ ఖైదీలుగా ఉన్న మాజీ ఎంపి సిరిసిల్ల రాజయ్య, ఆయన భార్య మాధవిల జుడీషియల్ రిమాండ్ గడువును కోర్టులో మరో 15 రోజులు పొడిగించింది. డిసెంబర్ 3 వరకు రిమాండ్ గడువును పొడిగిస్తున్నట్లు న్యాయమూర్తి ఆదేశించారు. ప్రధాన నిందితుడైన రాజయ్య కుమారుడు, సారిక భర్త అనిల్ రిమాండ్ గడువును కూడా డిసెంబర్ 3 వరకు పొడిగిస్తూ ఆదేశించారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications