కళాశాల హాస్టల్‌లో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

శ్రీఇందు ఇంజినీరింగ్ కళాశాలో బీటెక్ మొదటి సంవత్సరం చదుతున్న ఓ విద్యార్థిని హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన ఇబ్రహీం పట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని శేరిగూడ సమీపంలోని గ

హైదరాబాద్: శ్రీఇందు ఇంజినీరింగ్ కళాశాలో బీటెక్ మొదటి సంవత్సరం చదుతున్న ఓ విద్యార్థిని హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈసంఘటన ఇబ్రహీం పట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని శేరిగూడ సమీపంలోని గురువారం చోటుచేసుకుంది.

ఇబ్రహీంపట్నం సీఐ స్వామి కథనం ప్రకారం...మంచిర్యాల్‌ జిల్లా కేంద్రానికి చెందిన జి రోషిణి (18) శేరిగూడ సమీపంలోని శ్రీ ఇందూ కళాశాలలో బీటెక్‌ సీవిల్‌ ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. కళాశాల వసతి గృహంలోనే ఉంటోంది.

A B.tech girl student allegedly committed suicide in her college hostel

కాగా, గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో తన గది తలుపులను మూసి ఫ్యాన్‌కు ఉరేసుకుంది. ఎంతకూ తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన తోటి విద్యార్థులు కిటికీ తొలగించి చూడగా రోషిణి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది.

దీంతో వెంటనే వారు ఆమెను కిందకి దింపి కామినేని ఆస్పత్రికి తరలించారు. కాగా, అప్పటికే రోషిణి మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. రోషిణి ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటన స్థలాన్ని ఏసీపీ మల్లారెడ్డి, సీఐ స్వామి పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+