చాక్లెట్ ప్రియులకు అలర్ట్: ‘డెయిరీ మిల్క్’లో సజీవంగా పురుగు (వీడియో)

హైదరాబాద్: చాక్లెట్లు అంటే ఎవరికి ఇష్టం ఉండదు. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకూ ఏదో చాక్లెట్లు తింటూనే ఉంటారు. అయితే, అతిగా చాక్లట్లు తినడం మంచిది కాదని వైద్యులు చెబుతారు. మరోవైపు, ఆ చాక్లెట్ల తయారీలో ఉత్పత్తిదారుల నిర్లక్ష్యం వినియోగదారుల ఆరోగ్యానికి చేటు చేసేలా ఉంది. తాజాగా, పెద్దలు, పిల్లలు ఎంతగానో ఇష్టంగా తినే డెయిరీ మిల్క్ చాక్లెట్లో జీవించివున్న పురుగు రావడంతో కస్టమర్లు షాకయ్యారు.

హైదరాబాద్ నగరంలోని అమీర్‌పేట్‌లో ఈ ఘటన వెలుగుచూసింది. ఆ చాక్లెట్ కొన్న వినియోగదారుడు ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. ఓ సూపర్ మార్కెట్‌లో కొనుగోలు చేసిన డెయిరీ మిల్క్ చాక్లెట్‌లో సజీవ పురుగు కనిపించింది. చిన్న పురుగు కూడా చాక్లెట్ రంగులోకి మారుతోందంటూ వినియోగదారులు ఆందోళనకు గురయ్యాడు.

A customer found a worm crawling in Cadbury chocolate purchased at ameerpet metro station shop, Hyderabad

ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. సామాజిక కార్యకర్త రాబిన్ జాచ్యూస్ ఎక్స్(ట్విట్టర్)లో ఈ మేరకు పోస్టు చేసి వ్యాఖ్యానించాడు. అమర్‌పేట్ మెట్రో స్టేషన్‌లోని రత్నదీప్ సూపర్ మార్కెట్‌లో కొనుగోలు చేశానని, దీనికి సంబంధించిన బిల్లును కూడా జత చేశానని పేర్కొన్నారు.

డెయిరీ మిల్క్ చాక్లెట్‌లో పురుగులు ఉండటంపై క్యాడ్‌బరీ.. సూపర్ మార్కెట్ నిర్వాహకులను ప్రశ్నించారు. ఈ గడువు ముగిసిన ఉత్పత్తులకు నాణ్యత తనిఖీ ఉందా? ప్రజారోగ్య ప్రమాదాలకు ఎవరు బాధ్యత వహిస్తారు? అని రాబిన్ నిలదీశారు. గ్రేటర్ హైదరాబద్ మున్సిపల్ కార్పొరేషన్, క్యాడ్‌బరీ మిల్క్, రత్నదీప్ సూపర్ మార్కెట్ ను ట్యాగ్ చేశాడు. తాను కొనుగోలు చేసిన బిల్లును కూడా ఈ పోస్టుకు జతచేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+