భార్యాపిల్లలను వదిలేసి రెండోభార్యతో డాక్టర్ ఎంజాయ్.. మొదటి భార్య షాకింగ్ ఎటాక్.. ఏం చేసిందంటే!!
అతనో వైద్యుడు.. భారీగా కట్నం తెచ్చిన యువతిని పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లల తల్లిని చేశాడు. ఆపై ఏం జరిగిందో ఏమోకానీ భార్యను వదిలి పెట్టి, తనకీ భార్య వద్దంటూ కోర్టు మెట్లు ఎక్కారు. భార్య భర్తల పంచాయితీ కోర్టులో ఏం తేలకముందే మరో మహిళను వివాహం చేసుకొని సంసారం మొదలుపెట్టాడు. దీంతో భగ్గుమన్న మొదటి భార్య ఊహించని విధంగా భర్త పై ఎటాక్ చేసింది. భర్తను, అతని పెళ్లి చేసుకున్న రెండో భార్యను బాదిపారేసింది. సూర్యాపేటలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే

భార్యాభర్తల మధ్య గొడవలు.. భార్యను వదిలేసిన భర్త
సూర్యాపేటకు చెందిన భాను ప్రకాష్ అనే వైద్యుడు భారీగా కట్నం తీసుకొని ప్రియాంక అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. కట్నం కానుకలు మాత్రమే కాకుండా ప్రియాంక పేరు పై ఉన్న రెండు ఇళ్లను కూడా ఆమె తల్లిదండ్రులు భాను ప్రకాష్ కు బహుమతిగా ఇచ్చారు. వారిద్దరి దాంపత్యానికి ప్రతీకగా ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. ఆ తరువాత భార్య భర్తల మధ్య వచ్చిన మనస్పర్థలతో భార్యను వద్దని పుట్టింటికి పంపించేశాడు. ఇద్దరు పిల్లల తల్లి అయిన భార్యను నిర్దాక్షిణ్యంగా వదిలేశాడు.

కోర్టు మెట్లెక్కిన దంపతులు, కేసు కోర్టులో ఉండగా భర్త రెండో పెళ్లి
అప్పటి నుండి భార్య ప్రియాంక భర్తపై న్యాయపోరాటం చేస్తోంది. తాను తిరిగి రావాలంటే అదనపు కట్నం తీసుకురావాలని భర్త వేధింపులకు గురి చేస్తున్నట్లుగా భార్య ప్రియాంక ఆరోపిస్తోంది. కోర్టులో వీళ్ళిద్దరికీ సంబంధించి కేసు కొనసాగుతోంది. ఇద్దరికీ విడాకులు మంజూరు కాకముందే భర్త భాను ప్రకాష్, దేవిక అనే మరో మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. ఇది చట్టరీత్యా నేరం కావడంతో గుట్టుచప్పుడు కాకుండా రెండో భార్యతో కాపురం చేస్తూ జీవిస్తున్నాడు.
మొదటి భార్య బంధువులతో వెళ్లి దాడి.. భర్తకు, రెండో భార్యకు దేహ శుద్ధి
గతంలో కొంతకాలం హైదరాబాద్ ఆసుపత్రుల్లో పనిచేస్తూ హైదరాబాదులో జీవనం సాగించిన భానుప్రకాష్, మూడు నెలల క్రితం సూర్యాపేటకు వచ్చి అక్కడ కాపురం పెట్టాడు. ఈ విషయం తెలిసిన మొదటిభార్య ఆమె బంధువులతో కలిసి వెళ్లి భాను ప్రకాష్ పై, రెండవ భార్య దేవిక పై దాడికి దిగింది. భాను ప్రకాష్ చేతులు కట్టేసి అతని పై దాడి చేసిన బంధువులు, రెండవ భార్య దేవికకు దేహశుద్ధి చేశారు. రెండో భార్య దేవిక ఏడుస్తున్నా వదలకుండా విపరీతంగా కొట్టారు.

తనకు అన్యాయం చేసి మరో మహిళను పెళ్లి చేసుకున్న భర్తపై మొదటి భార్య ఆగ్రహం
కోర్టులో కేసు నడుస్తుండగా మరో వివాహం చేసుకోవడాన్ని మొదటి భార్య తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. తనకు, తన ఇద్దరు పిల్లలకు అన్యాయం చేసి మరో మహిళను పెళ్లి చేసుకొని సుఖంగా కాపురం చేస్తున్నాడంటూ భర్తపై మండిపడుతుంది. పోలీస్ స్టేషన్ కు వెళ్ళిన, కోర్టులకు వెళ్లినా, పెద్ద మనుషుల దగ్గరకు వెళ్ళినా సరే భర్త తన పలుకుబడితో వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది. తనకు, తన పిల్లలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తుంది. ఈ ఘటనలో ఇరు వర్గాలను పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించారు.












Click it and Unblock the Notifications