పెళ్లి చేయమంటే ప్రియుడ్ని ఠాణాలో వేశారు: యువతి ఆత్మహత్య
మధిర: ప్రేమించుకున్న తమకు పెళ్లి చేయమని ఆ ప్రేమ జంట పెద్దలను కోరింది. అందుకు వారు ఒప్పుకోలేదు. అంతటితో ఆగకుండా ఆ ప్రేమజంటను విడదీసి.. ప్రియుడ్ని అరెస్ట్ చేయించారు. దీంతో మనస్తాపానికి గురైన ప్రియురాలు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లాలోని మధిరలో చోటు చేసుకుంది.
మధిర మండలం బయ్యారం గ్రామంలో సోమవారం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి... మధిర పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అల్లీనగరం శివారు బయ్యారం గ్రామంలో చిలకబత్తిన జ్యోత్స్న(17) సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

మధిరలో ఇంటర్మీడియట్ చదువుతున్న ఈ యువతి.. దేశినేనిపాలెం గ్రామానికి చెందిన రాజు(23) అనే ఆటోడ్రైవర్‌ను ప్రేమించింది. వీరిద్దరు కొంతకాలం కిందట హైదరాబాద్ వెళ్లారు. జ్యోత్స్న తండ్రి స్వామినాథన్ తన కుమార్తె అపహరణకు గురైందని పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈమేరకు పోలీసులు హైదరాబాద్‌లో ఉన్న జ్యోత్స్న, రాజులను అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరిచారు.
జ్యోత్స్న మైనర్ కావడంతో ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చి 18 ఏళ్లు నిండిన తర్వాత వివాహం చేసుకోవచ్చని చెప్పారు. రాజును జైలుకు తరలించారు. తను ప్రేమించిన వ్యక్తితో పెళ్లి జరిపించకపోవడం, ప్రియుడు జైలుపాలవడంతో జ్యోత్స్న తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలో సోమవారం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. యువతి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.
-
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు -
కేబినెట్ భేటీలో ప్రధాని మోదీ సంచలన నిర్ణయాలు ఇవే.. -
అమరావతికి కేంద్రం మరో భారీ గుడ్ న్యూస్, ఈ సారి ఏకంగా..!! -
కిల్లర్ మిల్లర్.. గాయాన్ని సైతం లెక్కచేయని మొండిధైర్యం












Click it and Unblock the Notifications