అమ్మాయిపై పూజారి రేప్: బండరాయితో మోది హత్య
హైదరాబాద్: నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో పూజలు చేయడానికి వచ్చిన ఓ పూజారి అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఓల్డ్ బోయిన్‌పల్లి శ్రీకృష్ణకాలనీలో నివసించే ఓ వ్యక్తి దసరా పండగ రోజున తమ ఇంట్లో అమ్మవారికి పూజల చేయడానికి బేగంబజార్‌కు ఓ పూజారిని పిలిచాడు.
దీంతో పూజారి అక్కడికి వచ్చి పూజలు చేశాడు. అనంతరం అక్కడి అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించి, అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న బాధిత అమ్మాయి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బండరాయితో మోది యువతి హత్య

తలపై బండరాయితో మోది ఓ యువతిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కుషాయిగూడ వెంకటేశ్వరస్వామి ఆలయం ఎదురుగా ఉన్న పద్మావతికాలనీ పార్కు మైదానంలో ఆదివారం ఉదయం గుర్తుతెలియని యువతి(22) మృతదేహం పడి ఉందని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతురాలికి సమీపంలోనే బండరాయి ఉంది. ఖాళీ మద్యం సీసా, గ్లాసులు ఉన్నాయి. మృతురాలి కాళ్లకు ఉన్న మెట్టలను బట్టి వివాహితగా తెలుస్తోంది. తలపై బండరాయితో మోదటంతో రక్తం మడుగులో ఆమె ముఖం గుర్తించలేకుండా ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications