550 మందికి పైగా హత్యల ఆపరేషన్ కగార్ వెనుక భారీ కుట్ర.. మావోయిస్టుల సంచలనం!
ఏపీ, తెలంగాణా రాష్ట్రాలలో బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టులు కేంద్ర ప్రభుత్వం పై సంచలన ఆరోపణ చేశారు. మావోయిస్తులపై ప్రస్తుత ఆపరేషన్ కగార్ వెనుక కుట్రకు కారణం ఉందని వారు తాజాగా రాసిన లేఖలో వెల్లడించారు. శాంతి చర్చలు అని మావోయిస్టులు కోరుతున్నా ప్రభుత్వం అందుకు స్పందించకపోవటం వెనుక కారణం చెప్పారు.
జూన్ 20న బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్ట్ లు
తెలుగు రాష్ట్రాల కు చెందిన మావోయిస్టులు ఎన్ కౌంటర్ లలో మృతి చెందిన నేపథ్యంలో ఆపరేషన్ కగార్ ను వ్యతిరేకిస్తూ ఈ నెల 20న తెలుగు రాష్ట్రాలలో బంద్ కు మావోయిస్ట్ పార్టీ పిలుపు నిస్తున్నట్లు.. తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ లేఖ విడుదల చేసారు. తాజాగా మరోమారు లేఖ విడుదల చేసిన మావోయిస్ట్ పార్టీ కీలక ప్రకటన చేసింది. మావోయిస్ట్ అధికార ప్రతినిధి జగన్ పేరుతో ఈ లేఖను విడుదల చేసింది.

సీనియర్ సభ్యులను ఎన్కౌంటర్ పేరిట హత్య చేశారన్న మావోలు
45 ఏళ్ళ సుదీర్ఘ విప్లవోద్యమ అనుభవం కలిగిన సీనియర్ రాష్ట్ర కమిటీ సభ్యుడు కామ్రేడ్ టీఎల్ఎన్ఎస్ చలం అలియాస్ ఆనంద్, అలియాస్ సుధాకర్, 30 ఏళ్ళ విప్లవోద్యమ అనుభవం కలిగిన కామ్రేడ్ మైలారపు అడెల్ అలియాస్ భాస్కర్ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులతో పాటు 7గురిని ఎన్ కౌంటర్ పేరిట హత్య చేశారన్నారు.
550 మందికి పైగా హత్యల ఆపరేషన్ కగార్ వెనుక భారీ కుట్ర
2026 మార్చి నాటికి మావోయిస్టు పార్టీని నిర్మూలిస్తామని 2024 జనవరి నుండి ఆపరేషన్ కగార్ పేరుతో దేశంలోను మావోయిస్టు ఉద్యమ ప్రాంతాలన్నిటిలో తీవ్ర నిర్బంధాన్ని కొనసాగిస్తున్నదని లేఖలో తెలిపారు.అటవీ సంపదను, ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పగించే ఏకైక లక్ష్యంతో అటవీ ప్రాంతంలోని ఆదివాసులపై వారికి అండగా ఉండే మావోయిస్టు పార్టీపై వరుసగా దాడులు చేస్తూ 550 మందికి పైగా హత్యలు చేసిందనీ లేఖలో ఆరోపించారు.
బంద్ పాటించాలని కోరుతున్న మావోలు
ప్రభుత్వం చేస్తున్న బూటకపు చర్చల నాటకాన్ని ఎండగడుతూ, కగార్ దాడులను వ్యతిరేకిస్తూ జూన్ 20వ తేదీన ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాలలో బంద్ పాటించాలని అందరికీ పిలుపునిస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే జూన్ 10న కూడా మావోలు బంద్ కు పిలుపునివ్వగా భారత్ బంద్, కొన్ని ప్రాంతాల్లో పాక్షికంగా కొనసాగింది. ఈసారి కూడా పెద్దగా ప్రభావం ఉండదని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications