మాదాపూర్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం; స్క్రిప్ట్, రైటర్, షల్ వి మీట్!!
మాదాపూర్ డ్రగ్స్ కేసులో తీగ లాగితే డొంకంతా కదులుతుంది. మాదాపూర్ డ్రగ్స్ కేసు సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన చాలా మంది ఈ కేసులో ఉన్నారు. ప్రస్తుతం మాదాపూర్ డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ అధికారుల విచారణ లోతుగా కొనసాగుతోంది . ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న వారు పోలీసులు ఎదుట లొంగిపోవడం కేసును కీలక మలుపు తిప్పింది అని చెప్పవచ్చు.
మాదాపూర్ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ నార్కోటిక్స్ అధికారుల ఎదుట హాజరైన విషయం తెలిసిందే. హీరో నవదీప్ ను డ్రగ్స్ వినియోగదారుడుగా పేర్కొన్న పోలీసులు నిందితులలో ఒకరైన రామచంద్ర స్టేట్మెంట్ ఆధారంగా నవదీప్ ని విచారించారు. నవదీప్ నుంచి కీలక సమాచారం రాబట్టడానికి నార్కోటిక్స్ అధికారులు ప్రయత్నం చేశారు.

విచారణలో నవదీప్ డ్రగ్స్ సప్లై చేసిన రాంచందర్ తెలుసు కానీ తనకు అతనితో ఆర్ధిక లావాదేవీలు మాత్రమే ఉన్నాయని, డ్రగ్స్ గురించి తెలియదని చెప్పారు.ఇదిలా ఉంటే తాజాగా డ్రగ్స్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. డ్రగ్స్ కేసులో కీలక నిందితులైన కలహర్ రెడ్డి , హిటాచి సాయి, స్నార్ట్ పబ్ సూర్య లు పోలీసుల ముందు లొంగిపోయారు.
నిందితులు ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా, కోర్టు వారిని పోలీసులు ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది. ఈ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది. పోలీసుల ఎదుట లొంగిపోయిన వీరంతా సినీ ఇండస్ట్రీలో కోడ్ లాంగ్వేజ్ తో డ్రగ్స్ సరఫరా చేసినట్టు పోలీసులు గుర్తించారు.
స్క్రిప్ట్, రైటర్, షల్ వి మీట్ పేర్లతో వీరంతా దందా నడిపినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇక ఈ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరికొందరు డ్రగ్స్ వినియోగదారులకు పోలీసులు నోటీసులు జారీ చేసి విచారణ చేస్తున్నారు. ఇక ఇదే కేసులో హీరో నవదీప్ కూడా డ్రగ్స్ వినియోగదారుడుగా విచారణను ఎదుర్కొంటున్నారు.












Click it and Unblock the Notifications