హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్నేహితులమంటూ వచ్చి గొంతుకోశారు

|
Google Oneindia TeluguNews

A man allegedly killed by thugs in Hyderabad
హైదరాబాద్: నగరంలో పట్టపగలే ఓ యువకుడిని కత్తులతో పొడిచి, గొంతుకోసి కొందరు దుండగులు దారుణంగా హత్య చేశారు. బుధవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. రాజేంద్రనగర్ సర్కిల్ శివరాంపల్లి డివిజన్ రాఘవేంద్రకాలనీ సమీపంలోని బిన్‌తీఫ్‌కాలనీలో మహ్మద్ అబ్దుల్ జబ్బార్ తన కుటుంబంతోపాటు నివాసముంటున్నాడు.

అతనికి అబ్దుల్ రఫీక్(29) కొడుకు ఉన్నాడు. రఫీక్‌కు రెండేళ్ల క్రితం వివాహం చేశారు. ఏడాదిన్నర కొడుకు ఉన్నాడు. వీరికి సరూర్‌నగర్ మండలం జల్‌పల్లి పార్దీవాడలో ఇనుపరాడ్ల పరిశ్రమ ఉంది. తండ్రీకొడుకులు ఇద్దరూ పరిశ్రమను నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.

బుధవారం మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో పరిశ్రమ వద్దకు ఆటోలో ఇద్దరు యువకులు వచ్చారు. తాము రఫీక్ స్నేహితులమంటూ కాపలాదారుడికి చెప్పి లోనికి వెళ్లారు. అక్కడే రఫీక్‌తో ఐదు నిమిషాలపాటు మాట్లాడారు. అనంతరం వారు ఆటోలోనే బయటికి వెళ్లగా రఫీక్ తన బుల్లెట్ వాహనంపై అనుసరించాడు.

పార్దీవాడ సమీపంలోని రోడ్డుపక్కనే మరో ఆటోలో నలుగురు మద్యం తాగుతూ వీరి కోసం వేచి ఉన్నారు. సమీపంలోకి వచ్చిన తర్వాత వారి వద్ద కత్తులు ఉండటాన్ని గమనించిన రఫీక్ భయాందోళనకు గురై వాహనాన్ని వెనక్కి తిప్పే ప్రయత్నం చేశాడు. అంతలోనే దుండగులంతా అతన్ని పట్టుకున్నారు. కత్తులతో దాడి చేసి గొంతు కోసి హత్య చేశారు.

తన కుమారుడు ఇంటికి రాకపోవడంతో తమ పరిశ్రమ కాపలాదారుడిని జబ్బార్ ప్రశ్నించాడు. జల్‌పల్లి వైపు ఇద్దరు మిత్రులతో కలిసి వెళ్లాడని చెప్పడంతో ఆ మార్గంలో జబ్బార్ వెళ్లాడు. సమీపంలో కొడుకు బైకును చూశాడు. కొద్ది దూరంలోనే కత్తిపోట్లకు గురై రక్తమడుగులో విగతజీవిగా పడివున్న రఫీక్ మృతి దేహాన్ని గుర్తించాడు. సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇద్దరు దొంగల అరెస్ట్

ల్యాప్‌టాప్‌ల దొంగతనాలకు పాల్పడుతున్న తమిళనాడుకు చెందిన శంకరాపురం దొంగల ముఠాలోని ఇద్దరు సభ్యులను ఎస్సార్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 8 ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. అమీర్‌పేటలో బుధవారం తనిఖీలు చేస్తుండగా వెంకటస్వామి సుబ్రహ్మణ్యం(24), బాలాజీ(20)లు పోలీసులకు చిక్కారు. వీరిని సోదాలు చేయగా 8 ల్యాప్‌టాప్‌లు లభించాయని ఏసిపి వెంకటేశ్వర్లు తెలిపారు.

ఇప్పటి వరకు 100 ల్యాప్‌టాప్‌లు దొంగిలించినట్లు, తమ ముఠాలోని మరో ఐదుగురు నగరంలో చోరీలకు పాల్పడుతున్నారని నిందితులు పోలీసుల విచారణలో తెలిపారు. నిందితులను పట్టుకున్న ఎస్సార్‌నగర్ డిఐ శంకర్‌ను డిఎస్పీ రవికుమార్‌ను ఆయన అభినందించారు.

హుస్సేన్ సాగర్‌లో దూకి మహిళ ఆత్మహత్యాయత్నం

నగరంలోని హుస్సేన్ సాగర్‌లో దూకి ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అక్కడే ఉన్న పోలీసులు గమనించి ఆమెను కాపాడారు. ఆ మహిళ ఎందుకు ఆత్మహత్యకు ప్రయత్నించిందో వివరాలు తెలియరాలేదు.

English summary
A man allegedly killed by thugs in Hyderabad on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X