గుర్తుపట్టావా అంటూ మహిళలతో ఫోన్ లో లైంగిక వేధింపులు, చివరికిలా.....

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్:సెల్ ఫోన్ల్ లో మహిళలను లైంగికంగా వేధిస్తున్న ఓ వ్యక్తిని షీ టీమ్ పోలీసులు అరెస్టు చేశారు.చిత్తూరు జిల్లాకు చెందిన బాబాజాన్ అనే వ్యక్తి ఫోన్ చేసి మహిళలను వేధించడమే పనిగా పెట్టుకొన్నాడు.హైద్రాబాద్ కు చెందిన ఓ బాధితురాలు షీ టీమ్ ను ఆశ్రయించడంతో నిందితుడిని పోలీసులు పట్టుకొన్నారు.

చిత్తూరు జిల్లాకు చెందిన బాబాజాన్ కార్పెంటర్ గా పనిచేస్తున్నాడు. ఖాళీ సమయం దొరికితే చాలు సెల్ ఫోన్ లో ఏదో ఒక నెంబర్ కు పోన్ చేయడం అలవాటు చేసుకొన్నాడు. ఫోన్ ఎత్తిన వారు ఆడగొంతు అయితే తన మాటలతో విసిగించేవాడు. అసభ్య పదజాలాన్ని ఉపయోగించేవాడు. నెలల తరబడి ఎదురౌతున్న ఈ బాధను భరించలేక హైద్రాబాద్ కు చెందిన ఓ మహిళ షీటీమ్స్ ను ఆశ్రయించింది. దీంతో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

sexual harassement

బాబాజాన్ చిత్తూరు జిల్లా రామసముద్రం మండలం చెంబకూరు గ్రామం.తరచూ సెల్ ఫోన్ నెంబర్లను మార్చుతూ మహిళలను వేధిస్తుండేవాడు బాబాజాన్.ఈ మేరకు హైద్రాబాద్ కు చెందిన ఓ గృహిణిని బాబాజాన్ వేధించడం ప్రారంభించాడు.అర్థరాత్రి కూడ ఆమెకు ఫోన్ లు రావడం ప్రారంభమయ్యాయి.దీంతో ఆమె భర్త కూడ ఆమెను అనుమానించాడు.భార్య, భర్తల మధ్య గొడవలు కూడ ప్రారంభమయ్యాయి.

దీంతో బాధితురాలు షీటీమ్స్ ను ఆశ్రయించింది. షీ టీమ్స్ ఏసీపీ కవిత ,ఎస్ ఐ శోభన్ బాబు, కానిస్టేబుళ్ళు సతీష్ కుమార్, గోపాలకృష్ణ దర్యాప్తు ప్రారంభించారు. సెల్ ఫోన్ నెంబర్ ఆధారంగా నిందితుడికి నోటీసు జారీ చేశారు. అయితే అతని నుండి స్పందన రాలేదు.

దీంతో చిత్తూరు జిల్లా పోలీసుల సహయంతో బాబాజాన్ ను అరెస్టు చేసి జ్యూడిషీయల్ రిమాండ్ కు తరలించినట్టుగా అడిషనల్ సీపీ స్వాతిలక్రా ఆదివారం నాడు చెప్పారు. అయితే చాలా మంది మహిళలు వేధింపుల విషయమై ఇబ్బందిపడుతున్నారని ఆమె అభిప్రాయపడ్డారు. ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేయాలని ఆమె కోరారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
a man arrested for sexual harassmentin chittoor district. babajohn working as a carpenter in chebhakuru village at chittoor district.john obscene phone call with women.a lady complaint against john , police arrested john.
Please Wait while comments are loading...