తెలంగాణ ఉద్యమం తీర్చిదిద్దిన రాజకీయ నిప్పుకణం.. KTR
తెలంగాణ ఉద్యమం ఒక రాజకీయ నిప్పుకణాన్ని తీర్చిదిద్దింది. అప్పటివరకు ఉద్యోగం, వ్యాపారం గురించి మాత్రమే తెలుసు. రాజకీయాల గురించి అవగాహన ఉన్నప్పటికీ వాటి లోతు తెలియదు. కానీ తన తండ్రి ప్రారంభించిన ఉద్యమంలో ఏనాడైతే మమేకమయ్యాడో, ఏనాడైతే ఉద్యమం పేరుతో ఊరూ, వాడా చుట్టిరావడం ప్రారంభించాడో ఆరోజు నుంచే ఎక్కడో మారుమూల దాగివున్న రాజకీయ కణానికి నిప్పు రాజేసినట్లైంది. ఇంతింతై.. వటుడింతై అన్నట్లుగా ఈరోజు దేశంలోని అన్ని రాజకీయ పార్టీల నేతల నుంచి, పారిశ్రామికవేత్తల నుంచి, ఆర్థికవేత్తల నుంచి అభినందనలు అందుకుంటున్న ఆ నిప్పు కణమే.. KTR

ఒంటిచేత్తో అవలీలగా మూడు శాఖలు..
ఉమ్మడి ఏపీని విభజించిన తర్వాత తెలంగాణ రాష్ట్రసమితి అధికారంలోకి వచ్చింది. పాలకులకు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలనే తపన, పట్టుదల, చిత్తశుద్ది ఉంటే ఆ రాష్ట్రం ఏ విధంగాగా అభివృద్ధి చెందుతుందో తెలుసుకోవడానికి తెలంగాణే ఉదాహరణ. మునిసిపల్, ఐటి, పరిశ్రమల శాఖలను ఒంటి చేత్తో అవలీలగా, అత్యంత సమర్థవంతంగా KTR నిర్వహిస్తున్నారు.

తెలంగాణకు క్యూ కడుతున్న రూ.లక్షల కోట్ల పెట్టుబడులు
ఐటి పరిశ్రమల శాఖల మంత్రిగా తెలంగాణకు ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి లక్షల కోట్ల రూపాయల పెట్టబడులను KTR సాధించారు. ప్రపంచ ఆర్థికవేదిక సదస్సు ఎక్కడ జరిగినా అలవోకగా పెట్టుబడులను ఆకర్షించేవారు. వందల సంఖ్యలో ఐటీ కంపెనీలను, పరిశ్రమలను తెలంగాణకు రప్పించారు. దీనికోసం అడ్డంకిగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాల్లోని నియమ, నిబంధనలను సరళతరం చేశారు. ప్రభుత్వం తరఫున లెక్కకు మిక్కిలి ప్రోత్సాహకాలు అందుతుండటంతో ఐటీ కంపెనీలు తెలంగాణ బాట పడుతున్నాయి. ఇప్పటివరకు హైదరాబాద్‌కే పరిమితమైన ఐటీ కంపెనీలు వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్ వంటి నగరాలకు కూడా విస్తరించాయి. స్థానికులకు అక్కడే ఉద్యోగాలు లభించేలా KTR చూశారు.

సుందరీకరణంగా పురపాలకశాఖ
KTR పురపాలకశాఖ మంత్రిగా ఒక్క హైదరాబాద్ అనే కాకుండా రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాలు, జిల్లా కేంద్రాలతోపాటు గ్రామాలకు కూడా మౌలిక సౌకర్యాల కల్పనకు కృషిచేశారు. రోడ్లు, ఫ్లైఓవర్లు, పచ్చదనంతో నిండిన పార్కులు, చెరువుల సుందరీకరణ, మ్యూజికల్ ఫౌంటెయిన్లు, చెరువులపై ప్రత్యేక ఆకర్షణగా కేబుల్ వంతెనలు నిర్మింపచేశారు. స్మశానవాటికలను అద్భుతంగా అభివృద్ధి చేయించారు. ఎనిమిది సంవత్సరాల్లో ఒక్క హైదరాబాద్ నగరంలోనే 30 ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ రోడ్లు నిర్మింపచేశారంటే అసాధారణమైన విషయం. మరో 17ఫ్లై ఓవర్లు నిర్మాణ దశలో ఉన్నాయి. తాజాగా కూకట్‌పల్లి సమీపంలో కైతలాపల్లి ఫ్లైఓవర్‌ను మంత్రి KTR ప్రారంభించారు.

అందరికీ స్ఫూర్తిప్రదాత
ఒక్క మంత్రిగా మూడు శాఖలను సమర్థవంగా నిర్వహిస్తూ ఇన్నిరకాల అభివృద్ధి పనులను ఒంటిచేత్తో చేపడుతున్నారంటే సాధారణ విషయం కాదు. మరోవైపు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు అలవోకగా హైదరాబాద్ నగరానికి క్యూ కడుతున్నాయంటే అతిశయోక్తి కాదు. ఇదంతా తెలంగాణ ఉద్యమం నుంచి తనను తాను తీర్చిదిద్దుకున్న రాజకీయ నిప్పకణం ప్రతిభ. రాజకీయవేత్తలకేకాదు విద్యార్థులకు, పారిశ్రామికవేత్తలకు ప్రతి రంగంలో ఉన్నవారందరినీ ఆయన ఒక స్ఫూర్తి ప్రదాత. నిస్సందేహంగా పొగడ్త కాదు.. ఇది తెలంగాణ అదృష్టం.