విషాదం: పెళ్లైన 3వారాలకే నిప్పంటించుకుని టెక్కీ భార్య ఆత్మహత్య

Subscribe to Oneindia Telugu

సిద్దిపేట: జిల్లాలోని రాఘవాపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. పెళ్లై రోజులు గడవకముందే ఓ నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. రాఘవాపూర్ గ్రామానికి చెందిన మౌనిక(23)కు బెంగళూరులో సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్న సాయికృష్ణతో అక్టోబర్ 6న వివాహమైంది.

A newly wed woman committed suicide

ఈ క్రమంలో ఇటీవల నవదంపతులు హైదరాబాద్ వెళ్లి అక్కడ సాయికృష్ణ సోదరి ఇంట్లో రెండు రోజులపాటు ఉన్నారు. ఆ తర్వాత సాయికృష్ణ తిరిగి బెంగళూరు వెళ్లిపోయాడు.

కాగా, సోమవారం సాయంత్రం మౌనికను ఆమె తల్లి పుట్టింటికి తీసుకొచ్చింది. ఏం జరిగిందో ఏమో గానీ, మంగళవారం ఉదయం మౌనిక బాత్రూంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె ప్రాణాలు విడిచింది. మౌనిక ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A newly wed woman committed suicide in Siddipet district on Tuesday morning.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి