లగచర్ల దాడి ఘటనలో ఊహించని షాకింగ్ పరిణామం!
వికారాబాద్ జిల్లా లగచర్లలో భూసేకరణ నిమిత్తం వెళ్లిన కలెక్టర్ తో పాటు అధికారులపైన రైతులు దాడి చేసిన ఘటన ఆ తర్వాత చోటు చేసుకున్న అరెస్టుల నేపథ్యంలో తాజాగా కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో పలువురు రైతులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వారంతా సంగారెడ్డి జైల్లో రిమాండ్ ఖైదీలు ఉన్నారు.
జైల్లో రైతులను కలిసిన నేషనల్ హ్యూమన్ రైట్స్ కమీషన్ బృందం
ఇక తాజాగా వీరిని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ బృందం కలిసింది ఎనిమిది మంది సభ్యులతో కూడిన ఈ బృందం సంగారెడ్డి జైలుకు వెళ్లి రైతులను కలిసి మాట్లాడింది. నిన్న ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు చేరుకున్న ఎనిమిది మంది సభ్యులతో కూడిన నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సంగారెడ్డి జైలులో నిందితుడు సురేష్ తో సహా 19మందిని కలిసి లగచర్లలో అసలేం జరిగింది అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు.

మానవ హక్కుల కమీషన్ కు రైతుల ఫిర్యాదు
రైతుల అరెస్టు సమయంలో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని పలువురు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ను ఆశ్రయించారు. అమాయకులను కుట్రపూరితంగా అరెస్టు చేశారని హ్యూమన్ రైట్స్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. పోలీసులు గిరిజనుల పట్ల, ఆడవారి పట్ల అసభ్యంగా ప్రవర్తించారని, అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి తమ వారిని అరెస్టు చేశారని పలువురు బాధితులు జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారు.
ఫార్మా విలేజ్ వ్యతిరేకిస్తున్న రైతులు
తాజాగా 8 మంది సభ్యుల బృందం ఈ ఘటనపై విచారణకు రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా సంగారెడ్డి జైలుకు వెళ్లి జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న వారిని కలిసి వారి నుండి వివరాలను సేకరించింది. ఇది ఇలా ఉంటే లగచర్లలో ఫార్మా విలేజ్ ఏర్పాటును రైతులు అక్కడ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
కలెక్టర్ తో పాటు అధికారులపై రైతుల దాడి.. రేవంత్ ఆగ్రహం
ఈ క్రమంలోనే ఈనెల 11వ తేదీన అక్కడ భూసేకరణకు సంబంధించి అభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన వికారాబాద్ కలెక్టర్ తో పాటు ఇతర అధికారులపైన రైతులు దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత వీడియో ఫుటేజ్ ఆధారంగా దాడికి పాల్పడిన వారిని గుర్తించిన పోలీసులు పలువురిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఇక ఈ దాడి ఘటన పైన కుట్రపూరితంగానే అధికారులపై దాడులకు పాల్పడ్డారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.
బీఆర్ఎస్ కుట్రతోనే లగచర్ల ఘటన .. కాంగ్రెస్ టార్గెట్
ఈ ఘటనలో ప్రతిపక్షాల కుట్ర ఉందని పేర్కొన్న ఆయన అధికారులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. దీని వెనుక బీఆర్ఎస్ హస్తం ఉందని బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పాత్ర ఉందని కాంగ్రెస్ పార్టీ మంత్రులు నేతలు టార్గెట్ చేశారు .ఈ క్రమంలో ఈ కేసులో ఏవన్ నిందితుడిగా పట్నం నరేందర్ రెడ్డి ని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు ప్రస్తుత ఆయన చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications