డీకే అరుణ ఇంట్లో చొరబడిన ఆగంతకుడి అరెస్ట్, ఎవరంటే?

రెండు రోజుల క్రితం భారతీయ జనతా పార్టీ ఎంపీ డీకే అరుణ నివాసంలో చొరబడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు ఢిల్లీకి చెందిన అక్రమ్‌గా గుర్తించారు. నిందితుడ్ని వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్, జూబ్లీహిల్స్ పోలీసులు విచారిస్తున్నారు. ఎంపీ నివాసంలో చొరబడేందుకు గల కారణాలను తెలుసుకుంటున్నారు.

కాగా, నిందితుడు అక్రమ్ గతంలో హైదరాబాద్‌లోని పాతబస్తీ, ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడినట్లు సమాచారం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ సోమవారం ఎంపీ అరుణ ఇంటికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో నిందితుడిని మంగళవారం అరెస్ట్ చేయడం గమనార్హం. సంపన్నుల నివాసాలే లక్ష్యంగా నిందితుడు చోరీలకు పాల్పడతారని తెలిసింది.

A stranger who broke into DK Aruna s house was arrested

అర్ధరాత్రి ఎంపీ ఇంట్లో చొరబడిన నిందితుడు

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని రోడ్ నెంబర్ 56లో డీకే అరుణ నివాసం ఉంటున్నారు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో దుండగుడు చేతులకు గ్లౌజ్‌లు ధరించి డీకే అరుణ ఇంట్లోకి చొరబడ్డాడు. దాదాపు గంటన్నరపాటు ఆమె ఇంట్లో తిరిగినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబందించిన వివరాలను డీకే అరుణ కారు డ్రైవర్ లక్ష్మణ్ వెల్లడించారు.

శనివారం తెల్లవారుజామున 3 గంటలకు ఇంట్లో శబ్ధం వచ్చిందని.. కానీ, ఎవరు కనిపించలేదని తెలిపారు. కిచెన్‌లో పాదముద్రలు ఉన్నాయన్నారు. సీసీటీవీ ఫుటేజీ చూడగా.. ఓ వ్యక్తి వంగతగి వైపు కిటికీలోంచి వచ్చినట్లు కనిపించింది. మాస్క్, గ్లౌజ్‌లు వేసుకుని ఉన్నాడు. ఆ సమయంలో డీకే అరుణ ఇంట్లో లేరు. మీటింగ్ కోసం శనివారం మహబూబ్‌నగర్ వెళ్లారని డ్రైవర్ చెప్పారు.

ఆగంతకుడు గంటన్నరపాటు కిచెన్‌లో ఉన్నాడని, ఎంపీ గది వరకు వెళ్లాడని డ్రైవర్ చెప్పారు. అయితే, ఇంట్లో ఎలాంటి వస్తువులు పోలేదని తెలిపారు. ఒక్కడే వచ్చినట్లు సీసీ టీవీలో కనిపించిందన్నారు. జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశామని డీకే అరుణ డ్రైవర్ లక్ష్మణ్ తెలిపారు.

హైదరాబాద్‌లోని తమ నివాసంలో దుండగుడు చొరబడి ఘటనపై ఎంపీ డీకే అరుణ ఆందోళన వ్యక్తం చేశారు. తనతోపాటు తన కుటుంబానికి సెక్యూరిటీ పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఘటనపై విచారణ చేపట్టాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. గతంలో తమ కుటుంబంపై జరిగిన ఘటనను దృష్టిలో ఉంచుకుని భద్రత పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి 100 మీటర్ల దూరంలోని తన నివాసంలో ఇలా జరిగిందన్నారు. దుండుగుడు తన నివాసంలో ఏవైనా బగ్స్ పెట్టారా? అనే అనుమానం వ్యక్తం చేశారు.

బండి సంజయ్ ఆరా

డీకే అరుణకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఫోన్ చేశారు. దుండగుడు ఆమె ఇంట్లోకి ప్రవేశించిన ఘటనపై ఆరా తీశారు. ఘటనపై కేసు నమోదు చేయాలని పోలీసులు, అధికారులను బండి సంజయ్ ఆదేశించారు. డీకే అరుణ కుటుంబానికి భద్రత పెంచాలని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+