పెళ్లి చేయమంటే క్షుద్రపూజలు: ప్రియురాలి సూసైడ్

హైదరాబాద్: తమకు పెళ్లి చేయాలని కుటుంబసభ్యులను కోరితే.. వారు క్షుద్రపూజలు చేయాలని ఒత్తిడి చేయడంతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాధ ఘటన హయత్‌నగర్ మండలంలోని కొత్తగూడెంలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. కొత్తగూడెం గ్రామానికి చెందిన ఎండి సాదీక్ మియా కూతురు మెహరాజ్(21) డిగ్రీ చదువుతోంది. అదే గ్రామానికి చెందిన నర్సింహ కుమారుడు సాగర్.. మతాలు వేరైనా కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.

వీరి ప్రేమను అంగీకరించని ఇరు వర్గాల తల్లిదండ్రులు వివాహనికి నిరాకరించారు. మనస్తాపం చెందిన సదరు యువతి 22న సూసైడ్ నోట్ రాసి హెయిర్‌డై తాగింది. కాగా, ఆమె ఉస్మానియాలో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందింది.

A teenage girl allegedly committed suicide

ఘటనపై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. కాగా, మోహరాజ్ రాసిన సూసైడ్ నోట్ పోలీసులకు లభించింది. తాను సాగర్‌ను మనస్ఫూర్తిగా ప్రేమించానని తమ మతాలు వేరు కావడంతో ఇరు వర్గాల తల్లిదండ్రులకు గొడవలు జరిగినట్లు పేర్కొంది.

అయితే సాగర్ తల్లిదండ్రులు, అతని చిన్నాన్న ఒక ప్రదేశంలో మూడు నెలలు పూజలు చేస్తే గుప్తనిధులు తీయవచ్చని అందుకోసం తనను రమ్మని వేధించారని రాసింది. దీనిని తాను నిరాకరించనని పేర్కొంది. అయినా అదే పనిగా తనను వేధిస్తుండడంతో ఈ బాధ భరించలేకే చనిపోతున్నట్లు పేర్కొంది. తనను వేధించిన వారిని వదిలిపెట్టవద్దని తన సూసైడ్ నోట్‌లో పోలీసులను కోరింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+