Stray Dogs Attack: చిన్నారిపై వీధి కుక్కల దాడి.. వీడియో వైరల్..
తెలంగాణలో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. కొద్ది రోజులు క్రితం హైదరాబాద్ లోని మణికొండలో వాకింగ్ వెళ్లిన మహిళపై కుక్కలు దాడి చేశాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో జీహెచ్ఎంసీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. గతంలో కూడా హైదరాబాద్ లో ఓ బాలుడి కుక్కలు దాడి చేసి చంపేశాయి. అయినప్పటికీ వీధి కుక్కలను అదుపు చేయడంలో జీహెచ్ఎంసీ అధికారులు విఫలమయ్యారు. తాజాగా ఓ చిన్నారిపై కుక్కలు దాడి చేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇంటి బయట ఆడుకుంటున్న పిల్లాడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటన సంగారెడ్డిలోని శ్రీనగర్ కాలనీలో జరిగింది.మొత్తం ఆరు కుక్కలు చిన్నారిపై దాడి చేశాయి. వెంటనే స్థానికులు అతడిని రక్షించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో బాలుడిపై కుక్కలు దాడి చేసినప్పుడు స్థానికులు చిన్నారిని రక్షించడం చూడవచ్చు. కుక్కల దాడిలో బాలుడు గాయపడ్డాడు. బాలుడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

రాష్ట్రంలో చిన్న పిల్లలపై వీధికుక్కల దాడులు పునరావృతమవుతున్న ఘటనలపై తెలంగాణ హైకోర్టు సీరియస్‌గా స్పందించింది. వీధికుక్కల బెడద కారణంగా ప్రజలు ప్రాణాలు కోల్పోవడంపై కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. సమస్యను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చెప్పాలని స్పష్టం చేసింది. వీధికుక్కల నివారణకు తీసుకున్న చర్యలను వివరిస్తూ వారం రోజుల్లో నివేదిక సమర్పించాలని మున్సిపల్, రెవెన్యూ, వెటర్నరీ అధికారులను కోర్టు ఆదేశించింది.
CCTV Footage of Stray Dog Attack on Young Boy in Sangareddy Sparks Outrage
— Sudhakar Udumula (@sudhakarudumula) July 3, 2024
CCTV footage captured a distressing incident in Srinagar Colony, where a group of stray dogs attacked a young boy playing outside his home. The footage shows six dogs suddenly setting upon the boy,… pic.twitter.com/D2iaMm4JGf
ఈ మధ్య కాలంలో హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లో వీధికుక్కల దాడులకు చిన్నారులు బలి అవుతున్నారు. గతేడాది డిసెంబర్‌లో షేక్‌పేట పరిధిలోని వినోబా నగర్‌లో ఐదు నెలల పాప మృతి చెందింది. ఫిబ్రవరి 2024లో హైదరాబాద్‌లో వీధికుక్క దాడికి ఏడాది వయసున్న మరో చిన్నారి బలైంది. ఈ ఘ శంషాబాద్‌లో చోటుచేసుకుంది. ఏప్రిల్ 2024లో, గాయత్రీ నగర్‌లో నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్ భవనం వెలుపల ఆడుకుంటున్న రెండున్నరేళ్ల బాలికను వీధికుక్కలు కొట్టి చంపాయి. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాల వాసులకు వీధికుక్కల బెడద కొనసాగుతుండడంతో అనేక దాడులు జరిగినా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదు.












Click it and Unblock the Notifications