కొడుకు కోసం బ్లేడుతో భర్త గొంతుకోసిన భార్య

A woman allegedly murdered her husband
హైదరాబాద్: నగరంలోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. భార్యపై కోపం తన ఏడాది వయస్సున్న కొడుకును చంపేందుకు యత్నించగా.. నవమాసాలు మోసి కన్న ఆ తల్లి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కొడునుకు కాపాడుకునేందుకు భర్తను సైతం వద్దనుకొని అతని గొంతుకోసి హత్య చేసింది.

సోమవారం అర్ధరాత్రి జరిగిన ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని మాదన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని సంతోష్ నగర్ ఈదీ బజార్‌కి చెందిన మహ్మద్ గౌస్(26) స్థానికంగా ఇంటీరియర్ డెకరేటర్‌గా పనిచేస్తున్నాడు. గౌస్‌కి సంగారెడ్డికి చెందిన ఫరీదాతో నాలుగేళ్ల కిందట వివాహమైంది. వారికి రెండున్నరేళ్ల కూతురు తమ్రీన్, ఏడాది వయసున్న కొడు జాఫర్ ఉన్నారు.

గౌస్ కుటుంబం కొంతకాలంగా మియాపూర్‌లోని న్యూకాలనీలో నివాసం ఉంటోంది. అయితే గత కొన్ని నెలలుగా గంజాయి, మధ్యానికి బానిసైన గౌస్.. తన భార్యతో తరచూ గొడవపడేవాడు. నెలకిందట ఇళ్లు ఖాళీ చేసి అదే కాలనీలో ఉండే ఫరీదా తల్లి హాజీ బేగం ఇంట్లో ఉంటున్నారు.

కాగా, సోమవారం రాత్రి తరువాత ఇంటికి వచ్చిన గౌస్‌కి అతని భార్యకి గొడవ జరిగింది. కోపంతో గౌస్.. నిద్రిస్తున్న తన కొడుకు జాఫర్ గొంతునులిమే ప్రయత్నం చేశాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఫరీదా ఇంట్లో ఉన్న బ్లేడుతో గౌస్ గొంతు కోసింది. తీవ్ర రక్తస్రావం కావడంతో గౌస్ ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు, ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

భర్త ఇంటి ఎదుట భార్య ఆందోళన

ప్రేమించి పెళ్లాడిన తన భర్తకు తన అత్తామామలు మరో వివాహం చేసేందుకు ప్రయత్నించడంతో ఆగ్రహించిన ఓ మహిళ తన భర్త ఇంటి ఎదుట ఆందోళన చేపట్టింది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మల్లెపాక సందీప్ కుమార్ పీజీ చేస్తున్నాడు. అక్కడే ఊర్మిళ అనే యువతితో పరిచయం ఏర్పడింది.

పరిచయం కాస్త ప్రేమగా మారడంతో వారిద్దరూ జనవరి 22న ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్నారు. అనంతరం సొంత గ్రామం నల్గొండ జిల్లా పసునూరుకు వెళ్లారు. భర్తకు రెండో వివాహం జరిపించాలనే ఆలోచనతో అత్తింటి వారు ఇంటి నుంచి గెంటివేశారంటూ భర్త ఇంటి ఎదుట భైఠాయించి ఆందోళన చేపట్టింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+