కేసు పెట్టిందని! భార్య సన్నిహిత ఫొటోలు ఆన్‌లైన్‌లో పెట్టాడు, బెదిరింపు
వివాహమైన కొన్ని సంవత్సరాలపాటు ఆ దంపతుల కాపురం సజావుగానే సాగింది. అయితే, గత కొంతకాలం నుంచి వారి మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. తరచూ గొడవలు పడుతూ ఒకరిపై ఒకరు కేసులు కూడా పెట్టుకున్నారు.
హైదరాబాద్: వివాహమైన కొన్ని సంవత్సరాలపాటు ఆ దంపతుల కాపురం సజావుగానే సాగింది. అయితే, గత కొంతకాలం నుంచి వారి మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. తరచూ గొడవలు పడుతూ ఒకరిపై ఒకరు కేసులు కూడా పెట్టుకున్నారు. అంతేగాక, విడాకులు కూడా తీసుకునేందుకు సిద్ధమయ్యారు.
ఈ క్రమంలో భార్య తనతో సన్నిహితంగా ఉన్న ఫొటోలను ఆన్‌లైన్‌లో పెట్టాడు. దీంతో భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది భార్య. ఈ ఘటన నగరంలోని కూకట్‌పల్లి ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై సైబరాబాద్ పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మనస్పర్థలు, గొడవలు..
వివరాల్లోకి వెళితే.. పోలీసు కమిషనరేట్ పరిధిలోని కూకట్‌పల్లి ప్రాంతానికి చెందిన భార్యభర్తలు ఇటీవల తలెత్తిన మనస్పర్థాలతో వేరువేరుగా ఉంటున్నారు. వీరి గొడవలపై భర్త పై భార్య కొన్ని కేసులను నమోదు చేసింది.

బెదిరింపులు..
అదే విధంగా ఇద్దరు వీడిపోవడానికి సిద్ధమై విడాకుల కోసం ప్రయత్నిస్తు న్నారు.
ఈ సమయంలోనే భర్త నుంచి భార్యకు వేధింపుల మొదలయ్యాయి. తనపై పెట్టిన కేసులను విత్‌డ్రా చేసుకోవాలని బెదిరిస్తున్నాడు. దీనికి భార్య నుంచి వ్యతిరేక సమాచారం రావడంతో భర్తకు ఆమె పై కోపం పెరిగిపోయింది.

సన్నిహిత ఫొటోలు బహిర్గతం
ఈ నేపథ్యంలో భార్యపై కక్ష్య సాధించాలనే లక్ష్యంతో భార్యభర్తలుగా సంతోష సమయంలో సన్నిహితంగా తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాతో పాటు ఆమె బంధువులు, స్నేహితులకు కూడా పంపించి కేసులను విరమించుకోవాలని బెదిరింపులకు గురిచేశాడు.

పోలీసులను ఆశ్రయించి..
దీంతో భార్య సైబరాబాద్ పోలీసు ఉన్నతాధికారులను సంప్రదించడంతో వారు ఆదేశాలతో కేసును నమోదు చేసుకుని కోల్‌కతాలో ఉన్న భర్తను అరెస్టు చేసేందుకు ఓ బృందం అక్కడికి వెళ్ళినట్లు సమాచారం. సున్నితమైన అంశం కావడంతో సైబరాబాద్ పోలీసు అధికారులు ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించడం లేదు. భర్త అరెస్టు తర్వాత ఈ కేసుకు సంబంధించిన వివరాలు తెలిపే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications