గాంధీ ఆస్పత్రిలో మహిళా వైద్యురాలిపై దాడి

హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలిపై దాడి జరిగింది. ఎమర్జెన్సీ వార్డులో మహిళా జూనియర్ డాక్టర్‌పై రోగి సహాయకుడు దాడికి పాల్పడ్డాడు. ఆఫ్రాన్ లాగి, దాడి చేశాడు. దీంతో పక్కనే ఉన్న ఇతర సిబ్బంది ఆమెను అతడ్ని నుంచి కాపాడారు.

మహిళా వైద్యురాలిపై దాడికి పాల్పడిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. చిలకలగూడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రోగి సహాయకుడు దాడికి పాల్పడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

A woman doctor attacked in Gandhi hospital in Hyderabad

కాగా, జూనియర్ డాక్టర్లు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. విధుల్లో ఉన్న వైద్యులపై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నప్పటికీ ఇలాంటి దాడులు జరగడం గమనార్హం. ప్రాణాలు కాపాడే తమకు రక్షణ లేకుండా పోయిందంటూ వైద్యులు వాపోతున్నారు. ప్రభుత్వం తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు.

చాక్లెట్ల తయారీ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్ నగరంలోని పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి భాగ్యలక్ష్మి కాలనీలో చాక్లెట్ల తయారీ కంపెనీలో బుధవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. చాక్లెట్ల పౌడర్‌ను వేడి చేసే క్రమంలో గ్యాస్ లీకైంది. దీంతో దట్టమైన పొగలతోపాటు పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఇళ్ల మధ్యలో ఉన్న కంపెనీలో మంటలు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+