ఎసిబి దాడులు: బాత్రూంలోకి వెళ్లి బెదిరింపులు
అక్రమాస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలతో అబిడ్స్‌లో విధులు నిర్వహిస్తున్న జీహెచ్‌ఎంసీ బిల్ కలెక్టర్ నర్సింహారెడ్డి ఇంటిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడి చేశారు. కూకట్‌పల్లి శాతవాహననగర్, బాలానగర్ జగద్గిరిగుట్టలోని నివాసాల్లో శుక్రవారం ఉదయం ఏకకాలంలో దాడులు నిర్వహించారు.ఆయనకు 3 ఇళ్లు, 6 ప్లాట్లు, 90 తలాల బంగారం, సిద్దిపేటలోని నుంగనూరులో 15 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకూ ఏసీబీ అధికారులు నర్సింహారెడ్డికి చెందిన రూ.కోటికి పైగా అక్రమ ఆస్తులు గుర్తించారు.












Click it and Unblock the Notifications