priyanka reddy murder: ఉరితీయండి లేదా కాల్చేయండి.. చెన్నకేశవులు తల్లి

హైదరాబాద్/మహబూబ్‌నగర్: వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి సామూహిక అత్యాచారం, హత్య ఘటనపై నిందితుల కుటుంబసభ్యులు స్పందించారు. నిందితుల్లో ఒకడైన చెన్నకేశవులు తల్లి జయమ్మ మీడియాతో మాట్లాడారు. దోషిగా తేలితే ప్రియాంకను ఎలా చంపాడో.. తన కొడుకును కూడా అలానే చంపాలని అన్నారు.

తన భర్త ఆత్మహత్యకు యత్నించాడని..

తన భర్త ఆత్మహత్యకు యత్నించాడని..

తన కొడుకు ఇలాంటి పనిచేశాడని తెలిసి తన భర్త ఆత్మహత్యకు యత్నించాడని జయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రియాంక రెడ్డి సామూహిక అత్యాచారం, హత్య కేసులో పోలీసులు ఇప్పటికే నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

ఈ కేసులో ఏ1‌గా మహ్మద్ ఆరీఫ్(26, ఏ2 జొల్లు శివ(20), ఏ3 జొల్లు నవీన్(20), ఏ4 చింతకుంట చెన్నకేశవులు(20)గా ఉన్నారు.

మహ్మద్ వల్లే పాడైపోయాడు..

మహ్మద్ వల్లే పాడైపోయాడు..

తన కొడుకు ఇలా చేస్తాడని అనుకోలేదని, అతడు ప్రేమ వివాహం చేసుకున్నప్పటికీ తాము కాదనలేదని చెప్పారు చెన్నకేశవులు తల్లి జయమ్మ. అయ్యిందేదో అయ్యిందనుకున్నామని, వాడికి కిడ్నీ పాడైందని చెప్పారు.. జక్లేర్ వ్యక్తి మహ్మద్ ఆరీఫ్‌తో స్నేహం చేసిన తర్వాతే తన కొడుకు పాడైపోయాడని తెలిపింది.

ఊరంతా మా గురించే..

ఊరంతా మా గురించే..

లారీ లోడ్ చేయాలని అతనే తన కొడుకును తీసుకుపోయాడని చెప్పారు. ఇప్పుడు ఊరంతా తమ గురించే మాట్లాడుతున్నారని తెలిపింది. అయితే అందరికీ ఒకటే బాధ.. తనకు కూడా ఆడపిల్లలు ఉన్నారని చెప్పింది. పోలీసులు తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో తన కొడుకును తీసుకుపోయారని చెప్పింది.

Recommended Video

    Vet Doctor Murder Case Solved, Four People Arrested
    చంపేయండి.. కాల్చేయండి..

    చంపేయండి.. కాల్చేయండి..

    తన కొడుకు దోషిగా తేలితే ప్రియాంకను ఎలా చంపారో.. తనకు కొడుకును కూడా అలా చంపినా పర్వాలేదని తెలిపింది. ఉరితీయండి లేదా కాల్చి చంపండి అని ఆమె వాపోయింది. ఇప్పుడు తన కొడుకు ఏం చేయ్యొద్దంటే ఎవరూ వినరు.. తాను మాత్రమే 9 నెలలు మోసి కొడుకును కనలేదు కదా అని చెప్పింది. ఆ అమ్మాయి తల్లిది కూడా కడుపుకోతే.. అందరిదీ అదే బాధ అని జయమ్మ ఆవేదన కంటతడి పెట్టింది. బుధవారం రాత్రి ప్రియాంక రెడ్డిని ఈ నలుగురు నిందితులు అత్యంత దారుణంగా అత్యాచారం చేసి, హత్య చేశారు. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+