ఇప్పుడు కాకపోతే... పల్లెలు ఇంకెప్పుడు బాగుపడతాయి.: సీఎం కేసీఆర్

పల్లె ప్రగతిలో అలసత్వం వహించిన వారిపై చర్యలు తప్పవని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే పల్లె ప్రగతి కార్యక్రమాల తీరును పరీశీలించేందుకు ఫ్లయింగ్ స్కాడ్స్ రంగంలోకి దిగనున్నాయని సీఎం వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఇది ఒక పరీక్షలాంటిదని సీఎం చెప్పారు. ఇప్పటికే వందల కోట్ల రూపాయలు కేటాయించిన నెలరోజుల పాటు పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించిన ప్రభుత్వం ..వాటి పనితీరు , ఫలితాలపై సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు.

పల్లె ప్రగతిపై సీఎం సమీక్ష

పల్లె ప్రగతిపై సీఎం సమీక్ష

ఈ సంధర్భంగా సీఎం అధికారులు, ప్రజాప్రతినిధులకు పలు ఆదేశాలు జారీ చేశారు. పల్లె ప్రగతిలో భాగంగా పల్లె ప్రగతి ప్రతి నెల మూడువందల కొట్ల రూపాయలు కేటాయించామని, దీంతో పాటు పంచాయితీ రాజ్ శాఖలో అధికారుల ప్రమోషనలు, అంతర్గత వ్వహరాలు చక్కదిద్ది ఆ శాఖను పటిష్టపరిచిన నేపథ్యంలోనే గ్రామాల్లో అభివృద్దిపై ఫలితాలు రావాలని సీఎం ఆశీస్తున్నారు. దీంతో పకడ్భంది ప్రణాళికలతో గ్రామాల అభివృద్ది జరగాలని సీఎం కోరారు. ఈ సంధర్భంగా సెప్టెంబర్‌లో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యాక్రమం సత్పాలితాలను ఇచ్చిందని సీఎం సంతోషాన్ని వ్యక్తం చేశారు.

అధికారులు , ప్రజా ప్రతినిధులు చొరవ చూపాలి

అధికారులు , ప్రజా ప్రతినిధులు చొరవ చూపాలి

అయితే ఈ కార్యక్రమంపై ప్రజలు చూపిస్తున్నంత ఉత్సాహాన్ని అధికారులు ప్రజా ప్రతినిధులు చూయించడం లేదనే ఫిర్యాదులు తనకు క్షేత్ర స్థాయినుంచి అందుతున్నాయని సిఎం అన్నారు. ఇంతేకాకుండా వందశాతం ఫలితాలను రాబట్టాలంటే తనిఖీలు నిర్వహించడం ద్వారా, దిద్దుబాటు చర్యలు చేపట్టే అవకాశం వుంటుందని..సిఎం తెలిపారు. పరిస్థితులను బట్టి పల్లె ప్రగతి కార్యక్రమ పురోగతిని తనిఖీచేస్తామని, అందులో భాగంగా.. ప్లయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేసి పనితీరు మెరుగుపరుచుకోని అధికారులు, ప్రజా ప్రతినిధుల మీద చర్యలు తీసుకుంటామని సిఎం స్పష్టం చేశారు.

కలెక్టర్లదే బాధ్యత

కలెక్టర్లదే బాధ్యత

పల్లె ప్రగతి లో భాగంగా, ప్రతినెలా 339 కోట్ల రూపాయలను క్రమం తప్పకుండా ప్రభుత్వం విడుదల చేస్తున్నదని చెప్పారు. పల్లెను అభివ్రుద్ది పథంలో నడిపించే దిశగా కలెక్టర్లకు అధికారాలను ఇచ్చామని సిఎం అన్నారు. దీంతోపాటు అధికారుల ప్రమోషన్ ఇవ్వడంతో పాటు, పచ్చదనం పారిశుద్యతను మెరుగుపరిచేందుకు గ్రామస్థాయిలో పని వ్యవస్థలను కూడా పటిష్టం చేశామని ఇందుకోసం గ్రామోద్యోగుల జీతాలు కూడా పెంచినామని చెప్పారు., ఇన్ని రకాల చర్యలు తీసుకున్న తర్వాత కూడా పల్లెల్లో ప్రగతి అనుకున్నవిధంగా ముందుకు పోకపోతే అది కలెక్టర్లు, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులదే బాద్యత అని స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+