ఎక్సైజ్ గుడిలో పూజలు చేసి, సిట్ ముందుకు నందు: తెరపడినట్లేనా?
డ్రగ్ రాకెట్ కేసులో నటుడు నందు మంగళవారం ఉదయం పది గంటల సమయంలో ఎక్సైజ్ కార్యాలయానికి వచ్చారు. ఆయనను సిట్ విచారిస్తోంది.
హైదరాబాద్: డ్రగ్ రాకెట్ కేసులో నటుడు నందు మంగళవారం ఉదయం పది గంటల సమయంలో ఎక్సైజ్ కార్యాలయానికి వచ్చారు. ఆయనను సిట్ విచారిస్తోంది.
నందు తన తండ్రి, మేనమామతో కలిసి ఎక్సైజ్ కార్యాలయానికి వచ్చారు. విచారణకు వెళ్లడానికి ముందు ఎక్సైజ్ కార్యాలయంలో ఉన్న దేవాలయానికి వెళ్లి పూజలు చేశారు.

అనంతరం విచారణకు హాజరయ్యారు. 12 మంది సినీ ప్రముఖులకు నోటీసులు ఇచ్చారు. నందు విచారణతో అందరి విచారణ ముగుస్తుంది.
దీంతో, ఇక్కడితో సినీ ప్రముఖుల విచారణ తెరపడినట్లేనా, రెండో లిస్ట్‌లోని వారికి ఎప్పుడు నోటీసులు అందిస్తారనే చర్చ సాగుతోంది. సోమవారం వరకు 11 మంది సినీ ప్రముఖులను 88 గంటల పాటు విచారించారు.
కాగా, నవదీప్, తరుణ్ పబ్బుల అంశంపై, పూరీ జగన్నాథ్‌తో పరిచయం, నందు సినిమాల్లో బ్యాంకాక్ వెళ్లిన అంశాలపై సిట్ ప్రశ్నించనుందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications