ట్విస్ట్‌ల మీద ట్విస్ట్: లిస్టు బయటపెట్టిన సుబ్బరాజు, వారికి చుక్కలేనా?
సినీనటుడు సుబ్బరాజు సిట్ అధికారులకు శుక్రవారం నాడు కీలక సమాచారాన్ని ఇచ్చారని తెలిసింది. సినీ పరిశ్రమకు చెందిన 15 మంది ప్రముఖుల పేర్లను ఆయన బయటపెట్టినట్టు తెలుస్తోంది. సుదీర్ఘంగా ఆయనను సిట్ అధికారులు వ
హైదరాబాద్: సినీనటుడు సుబ్బరాజు సిట్ అధికారులకు శుక్రవారం నాడు కీలక సమాచారాన్ని ఇచ్చారని తెలిసింది. సినీ పరిశ్రమకు చెందిన 15 మంది ప్రముఖుల పేర్లను ఆయన బయటపెట్టినట్టు తెలుస్తోంది. సుదీర్ఘంగా ఆయనను సిట్ అధికారులు విచారించారు.
పూరీజగన్నాథ్ బ్యాచ్‌కు చెందిన నటుడు సుబ్బరాజును సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. 13 గంటలపాటు ఆయన విచారణ సాగింది.అయితే ఈ విచారణలో ఆయన కీలక సమాచారాన్ని వెల్లడించారు.
ఈ సమాచారం ఆధారంగానే ఎక్సైజ్ పోలీసులు మరింత లోతుగా ఈ విచారణను కొనసాగించాలని భావించారు. ఈ కేసు విషయమై సిట్ అధికారులు ఎప్పుడు పిలిచినా వస్తానని సుబ్బరాజు ప్రకటించారు.
సుబ్బరాజు ఇచ్చిన సమాచారం ఆధారంగా సోమవారం నాడు మరికొందరికి నోటీసులు జారీ అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. అయితే సుబ్బరాజుకు కూడ డ్రగ్స్ తీసుకొనే అలవాటుందా అనే విషయాన్ని శాస్త్రీయంగా నిర్ధారించేందుకుగాను ఆయన బ్లడ్ శాంపిల్స్ తీసుకొన్నారు.

15 మంది పేర్లు బయటకు ఇలా
13 గంటలపాటు సిట్ అధికారుల విచారణను ఎదుర్కొన్న సినీ నటుడు సుబ్బరాజు 15 మంది సినీ ప్రముఖులకు డ్రగ్స్ తీసుకొనే అలవాటుందని చెప్పారని సమాచారం. డ్రగ్స్ వాడేవారిలో ప్రముఖ నిర్మాత ఇద్దరు కొడుకులు కూడ ఈ అలవాటు ఉందని చెప్పినట్టు సమాచారం. మిగిలిన 13 మంది నటీనటులున్నారని ఆయన చెప్పినట్టు సమాచారం. అయితే తాను మాత్రం డ్రగ్స్ తీసుకోలేదని ఆయన విచారణలో చెప్పినట్టు సమాచారం.పబ్‌ల కేంద్రంగా డ్రగ్స్ దందా సాగుతోందనే విషయాన్ని సుబ్బరాజు వెల్లడించారు. దీంతో పబ్‌ల యాజమాన్యాలతో శనివారం నాడు అకున్ సబర్వాల్ సమావేశం కానున్నారు.
Recommended Video


ఆధారాలు చూపడంతో ఇలా..
ఉదయంపూట విచారణకు, మధ్యాహ్నానికి జరిగిన విచారణలో తేడా చోటుచేసుకొన్నట్టు సమాచారం. ఉదయం పూట సిట్ అధికారులు అడిగిన ప్రశ్నకు ఆయన తేలికగా సమాధానం చెప్పారు. అయితే సిట్ అధికారులు సాక్ష్యాలను బయటపెట్టడంతో సంచలన విషయాలను సుబ్బరాజు బయటపెట్టినట్టు తెలుస్తోంది. సుబ్బరాజు కీలకమైన సమాచారాన్ని వెల్లడించినట్టు ఎక్సైజ్ శాఖ కమిషనర్ చంద్రవదన్ ప్రకటించారు.

ఎంతటివారైనా వదలం
సుబ్బరాజు నుండి కీలకమైన సమాచారాన్ని సేకరించినట్టుగా సిట్ అధికారులు చెబుతున్నారు. ఈ సమాచారం ఆధారంగానే విచారణను మరింత లోతుగా చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. అయితే ఈ కేసులో ఎంతటివారున్నా వదిలే ప్రసక్తే లేదని సిట్ అధికారులు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడ ఈ కేసును సీరియస్‌గా తీసుకొంది. సిట్ కు ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నారు.

4. తరుణ్ విచారణ
బాల నటుడిగా సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించిన తరుణ్‌ను శనివారం నాడు సిట్ అధికారులు విచారించనున్నారు. తరుణ్ కు ో పబ్ కూడ ఉన్నట్టు సమాచారం. ఆ పబ్ తో పాటు పలు పబ్ ల నుండి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారనే సమాచారాన్ని సుబ్బరాజు చెప్పినట్టు సమాచారం.అయితే తాను మాత్రం డ్రగ్స్ తీసుకోలేదని ఆయన ప్రకటించారు.












Click it and Unblock the Notifications