మల్లన్న ఆలయంలో ఏఈఓ రాసలీలలు: మహిళలను లోబర్చుకుని..
ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి ఆలయంలో ఏఈఓ పని చేస్తున్న వైరాగ్యం అంజయ్య రాసలీల బాగోతం బట్టబయలైంది.
సిద్ధిపేట: ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి ఆలయంలో ఏఈఓ పని చేస్తున్న వైరాగ్యం అంజయ్య రాసలీల బాగోతం బట్టబయలైంది. ఏకంగా గుడి ఆవరణలోనే మహిళలతో సరసల్లాపాల్లో మునిగితేలుతుండటం గమనార్హం. కొందరు మహిళలకు మాయమాటలు చెప్పి వారితో రాసలీలలు కొనసాగిస్తున్నారు అంజయ్య. అందుకు ప్రతిఫలంగా వారికి లేదా వారి కుటుంబసభ్యులు, బంధువులకు కాంట్రాక్టు ఉద్యోగాలు కూడా ఇప్పిస్తున్నాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
అంతేగాక, తన కోరిక తీర్చని వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తూ.. వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు సమాచారం. కాగా, రాసలీలలతో అంజయ్య ఆలయ పవిత్రతను భ్రష్టుపట్టిస్తున్నాడని పేర్కొంటూ గతంలో నే గుర్తు తెలియని వ్యక్తులు కరపత్రాలు పంపిణీ చేయడం గమనార్హం.

ఆలయ గె స్ట్‌హౌజ్‌లలో మద్యం సేవిస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నా డని అందులో పేర్కొన్నారు. ఈ విషయం అప్పట్లో కలకలం రేపింది. అయినా అంజయ్యలో మార్పు లేదు. అంజయ్య రాసలీలలకు సంబంధించిన ఫొటోలు ఓ పత్రికకు చిక్కడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వాటిలో కొన్ని ఆలయ బుకింగ్ కార్యాలయం, గెస్ట్‌హౌజ్ వెనక భాగంలో దిగినవి కాగా, మరికొన్ని వాహనం, గదుల్లో సాగించిన రాసలీలలకు సంబంధించినవి ఉన్నాయి.
కాగా, గతంలో వేద పండితుడిపై చేయి చేసుకున్న క్రమంలో అంజయ్య సస్పెన్షన్‌కు గురయ్యాడు. వివిధ ఆరోపణలతో పలుమార్లు మల్లన్న ఆలయం నుంచి బదిలీ అయ్యాడు. అయినా, కొద్ది సమయంలోనే తిరిగి కొమురెల్లికి తిరిగి వచ్చేస్తున్నాడు. ఏఈవో పదోన్నతి కోసం అంజయ్య నకిలీ డిగ్రీ ధ్రువీకరణ పత్రాన్ని పొందుపరిచిన విషయంలో ఏకంగా దేవాదాయ శాఖ కమీషనర్‌నే కోర్టుకు హాజరు కావాలంటూ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏఈవో వైరాగ్యం అంజయ్యపై ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలంటూ పలువురు భక్తులు ఉన్నతాధికారులను కోరుతున్నారు.












Click it and Unblock the Notifications