Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మాజీ సీఎం కు తెలంగాణ బాధ్యతలు- రాహుల్ నిర్ణయం..!!

తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో పార్టీని మరింత గా బలోపేతం చేయటం కోసం రాహుల్ గాంధీ ప్రత్యేకంగా ఫోకస్ చేసారు. పాలనా పరంగా రేవంత్ పైన పూర్తి నమ్మకంతో ఉన్న హైకమాండ్.. ఇప్పుడు పార్టీ వ్యవహారాల కోసం కొత్త ఇంఛార్జ్ ను నియమించాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న దీపాదాస్ మున్షీ స్థానంలో మాజీ సీఎం కు తెలంగాణ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

కొత్త ఇంఛార్జ్ గా
కాంగ్రెస్ అధినాయకత్వం పలు రాష్ట్రాల పార్టీ ఇంఛార్జ్ ల మార్పు పైన కసరత్తు చేస్తోంది. అందు లో భాగంగా తెలంగాణ బాధ్యతల పైన కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో పార్టీ విజయం సాధించిన తరువాత దీపాదాస్ మున్షీని పార్టీ ఇంఛార్జ్ గా నియమించారు. కాగా, ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో అవసరాలు.. మారుతున్న రాజకీయ సమీకరణాలకు అనుగుణంగా కొత్త ఇంఛార్జ్ ల నియామకం పైన నిర్ణయాలు జరుగుతున్నాయి. ఇక, ప్రస్తుత తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దీపాదాస్ మున్షీ స్థానంలో ఛత్తీస్ ఘడ్ మాజీ సీఎం భూపేష్ బగెల్ ను నియమించాలని డిసైడ్ అయ్యారు.

AICC chances to appoint appoint Bhupesh Baghel as new incharge for Telangana Congress

రాహుల్ కసరత్తు
దీపాదాస్ మున్షీ సేవలు త్వరలో ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో వినియోగించాలని పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ప్రస్తుత మార్పులు చేస్తున్నట్లు చెబుతున్నారు. త్వరలో ఎన్నికలు జరిగే ఢిల్లీ, బీహార్ పైన కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ చేసింది. అక్కడ ప్రత్యేకం గా ఎంపికగా చేసిన పార్టీ నేతలను మొహరిస్తోంది. సంక్రాంతి లోగానే ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉంది. అక్కడ ఆప్ తో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేయాలని కాంగ్రెస్ డిసైడ్ అయింది. ఈ క్రమంలో ఢిల్లీతో పాటుగా బీహార్ ఎన్నికలు కాంగ్రెస్ నాయకత్వానికి ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి.

కాంగ్రెస్ నిర్ణయాలు
తెలంగాణ లో పూర్తిగా సీఎం రేవంత్ - మహేష్ గౌడ్ ప్రభుత్వం .. పార్టీ వ్యవహారాలను ముందుండి నడిపిస్తున్నారు. ఇక, త్వరలో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ టైం లో రాష్ట్రంలో పార్టీని మరింతగా బలోపేతం చేయటంతో పాటుగా పీసీసీ - జిల్లా కమిటీలు పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇప్పటికే కసరత్తు కొనసాగుతోంది. బడ్జెట్ సమావేశాల తరువాత ఈ ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ సమయంలో మాజీ సీఎం కు తెలంగాణ పార్టీ ఇంఛార్జ్ బాధ్యతలు అప్పించాలని కాంగ్రెస్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేసే ఛాన్స్ కనిపిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+