సీఏఏ అమలు ఇప్పుడే ఎందుకు?: కేంద్రంపై అసదుద్దీన్ ఒవైసీ ఫైర్
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం(CAA)-2019ను అమల్లోకి తీసుకురావడంపై ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు. మతం ఆధారంగా కాకుండా హింసకు గురైన వారికి ఆశ్రయం ఇవ్వాలని ఒవైసీ డిమాండ్ చేశారు. ఎన్నికలు రాగానే సీఏఏ నిబంధనలు వస్తాయని విమర్శించారు. పౌరసత్వ సవరణ చట్టంపై తమకు అభ్యంతరాలున్నాయని ఆయన పేర్కొన్నారు.
'సీఏఏపై మాకున్న అభ్యంతరాలు అలాగే ఉన్నాయి. వీటి నిబంధనలను ఐదేళ్లుగా ఎందుకు పెండింగ్‌లో పెట్టారు? ఇప్పుడే ఎందుకు అమలు చేస్తున్నారు?' అని అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. వీటికి కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు.ముస్లింలే లక్ష్యంగా సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్ తెచ్చారని ఒవైసీ ఆరోపించారు. ఈ మేరకు కేంద్రంపై విమర్శలు గుప్పిస్తూ ట్విట్టర్ వేదికగా పోస్టు పెట్టారు.

ఇదిలా ఉండగా, కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం అమలుకు మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. సీఏఏ అమలుతో డిసెంబర్ 31, 2014 లేదా అంతుకు ముందు పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారత్‌లోకి వచ్చిన హిందువులు, జైనులు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలు పౌరసత్వం లభించనుంది.
మరోవైపు, సీఏఏ అమలుపై విపక్ష పార్టీల నేతలు కేంద్రంపై భగ్గుమన్నాయి. ఎన్నికలకు ముందు పౌరసత్వ సవరణ చట్ట నిబంధనలను కేంద్రం నోటిఫై చేయడం మతప్రాతిపదికన ఓటర్లను విభజించేందుకేనని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, అసోంలో ప్రజల మధ్య విభజన చిచ్చు రాజేసేందుకేనని అన్నారు. సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ కూడా సీఏఏను అమల్లోకి తీసుకొచ్చిన కేంద్రంపై విమర్శలు గుప్పించారు.
లోక్‌సభ ఎన్నికలకు తేదీలు ప్రకటించేందుకు కొన్ని రోజుల ముందు సీఏఏ అమలు కేవలం రాజకీయ కారణాలతోనే చేపట్టారని పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ ఆరోపించారు. ఎన్నికలకు ముందు డ్రామా చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ నోటిఫికేషన్‌లో నిబంధనలను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన అనంతరం రేపటి హౌరా సమావేశంలో వాటిపై మాట్లాడతానని మమతా బెనర్జీ తెలిపారు. మతం, కులం, భాషం ఆధారంగా ఎలాంటి వివక్ష చూపినా తాము ఆమోదించబోమని మమతా బెనర్జీ పేర్కొన్నారు.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications