శంషాబాద్ విమానాశ్రయంలో ఎయిరిండియా విమానాలు రద్దు: ప్రయాణికుల ఆందోళన
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో సోమవారం ఎయిర్ ఇండియా విమానాలు రద్దయ్యాయి. మొత్తం ఎనిమిది విమాన సర్వీసులను నిలిపివేసినట్లు ఆ సంస్థ ప్రకటించింది. దీంతో విషయం తెలియక ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు.
తిరుపతి, బెంగళూరు, మైసూరు, హైదరాబాద్(Hyderabad) విమానాలు రద్దు చేసినట్లు ఎయిరిండియా(Air India) పేర్కొంది. సాంకేతిక కారణాల వల్లే ఆకస్మాత్తుగా విమానాలు రద్దు చేయాల్సి వచ్చిందని సంబంధిత అధికారులు వెల్లడించారు.

అయితే, ఈ విషయం తెలియని చాలా మంది ప్రయాణికులు సోమవారం ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చారు. ఎయిర్ ఇండియా నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ముందస్తు ఇవ్వకుండా రద్దు చయడంపై ఆందోళనకు దిగారు.
తాము వెళ్లాల్సిన విమానం ఎంతకూ రాకపోవడంతో సంబంధిత అధికారులను నిలదీశారు. దీనిపై ఎయిరిండియా యాజమాన్యం స్పందించింది. టికెట్ డబ్బులను ప్రయాణికులకు రీఫండ్ చేసింది. అయినప్పటికీ తమ సమయం వృథా చేశారంటూ ప్రయాణికులు మండిపడ్డారు.












Click it and Unblock the Notifications