హెచ్‌సియు ఘటనపై అక్బర్ నిలదీత: తిప్పికొట్టిన కెసిఆర్

హైదరాబాద్ : హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సియు) ఘటనపై శనివారం తెలంగాణ శాసనసభలో గందరగోళం చోటు చేసుకుంది. హెచ్‌సియు ఘటనపై తక్షణమే చర్చించాలంటూ ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. వీసీ పొదిలె అప్పారావు తిరిగి బాధ్యతల్లో చేరడం వల్లనే హెచ్‌సియు ఘటనలు చోటు చేసుకుంటున్నాయని అక్బరుద్దీన్ ఓవైసి అన్నారు.

వీసిని రీకాల్ చేయాలని కేంద్రాన్ని కోరుతూ శాసనసభలో తీర్మానం చేయాలని అక్బరుద్దీన్ నిలదీశారు. తాము ప్రభుత్వానికి మిత్రులమని, అయితే హెచ్‌సియు ఘటనలో ప్రభుత్వం కేంద్రం ఒత్తిడికి తలొగ్గుతోందని ఆయన అన్నారు. అయితే, ఆ ఘటనపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం పదే పదే చెప్పింది.

శాసనసభలో చర్చ జరగకుండా అడ్డుకున్న మజ్లీస్ నేతలపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏ విషయంపై చర్చించాలో సూటిగా చెప్పకుండా కార్యకలాపాలు అడ్డుకోవడం సరికాదని సూచించారు. ప్రభుత్వం దళిత వ్యతిరేకి అన్న మజ్లీస్ మాటలపై కూడా ముఖ్యమంత్రి మండిపడ్డారు. తామెప్పుడూ అలా ప్రవర్తించలేదని స్పష్టం చేశారు.

Akbaruddin Owaisi questions: KCR retaliates

యూనివర్సిటీల్లో ఘటనపై చర్చకు సిద్ధంగా ఉన్నామని కెసిఆర్ స్పష్టం చేసారు. చర్చకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నా.. సభలో అనవసరంగా నినాదాలు చేయడం సరికాదన్నారు. పొలిటికల్ మైలేజ్ కోసం ప్రయత్నం చేయడం మంచిది కాదని కెసిఆర్ అన్నారు.

కాగా, హైదరాబాద్ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ ఘటనలపై అసెంబ్లీలో చర్చ జరిగింది. హెచ్‌సీయూ, ఓయూ ఘటనపై హోంమంత్రి నాయినీ నర్సింహరెడ్డి వివరణ ఇచ్చారు. సంపులో పడి మృతి చెందిన వ్యక్తిని తరలించకుండా ఓయూ విద్యార్థులు అడ్డుకున్నారని చెప్పారు. మృతుడు మాణికేశ్వర్‌నగర్‌కు చెందిన శిలారి బాబు. మృతుడు విద్యార్థి కాదని... రోజువారి కూలీ అని పోలీసులు స్పష్టం చేశారని, అయినా వినకుండా విద్యార్థులు రాళ్లు రువ్వడంతో పోలీసులు తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు.

మృతుడు స్టూడెంటేనని ఎమ్మెల్యే సంపత్ పోలీసులతో వాదనకు దిగారని అన్నారు. మృతుడు విద్యార్థి కాదని పోలీసులు చెప్పినా ఎమ్మెల్యే సంపత్ వినలేదని చెప్పారు. అక్కడ విషయాన్ని రాజకీయం చేయాలని చూశారని విమర్శించారు. హెచ్‌సీయూ వీసీ అప్పారావు ఛాంబర్‌ను విద్యార్థులు ధ్వంసం చేశారని, విద్యార్థులకు పోలీసులు సుమారు ఆరు గంటలపాటు నచ్చజెప్పే ప్రయత్నం చేశారని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+