Supriya, Adavi Sesh: త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్న సుప్రియ, అడవి శేషు..!
అక్కినేని నాగార్జున మేనకోడలు, నాగేశ్వరరావు మనవరాలు సుప్రియ, హీరో అడవి శేషు త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2019 నుంచి వీరిద్దరు ప్రేమించుకుంటున్నట్లు తెలిసింది. అక్కినేని వారి ఇంట జరిగే శుభకార్యాల్లో శేష్ కనిపించడంతో పాటు వారిద్దరూ కలిసి ఉన్న ఫొటోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. సుప్రియ, అడవి శేష్ పెళ్లికి శేష్ కుటుంబం ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.
వీరి పెళ్లి త్వరలో జరగబోతుందట. ఈ పెళ్లిని అక్కినేని నాగార్జున దగ్గరుండి జరిపిస్తారని సమాచారం. జూన్ 16న సుప్రియ, శేషు ఒకటి కాబోతున్నట్లు తెలుస్తోంది. సుప్రియకు తండ్రి సురేంద్ర యార్లగడ్డ, తల్లి సత్యవతి యార్లగడ్డ, సోదరుడు సుమంత్ ఉన్నారు. తల్లి సత్యవతి మరణించారు. సుప్రియ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయితో సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించారు. ఆ తర్వాత ఆమె నటనకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుని సినీ నిర్మాణంలోకి వచ్చారు.

1997 ఆమె ఆహా చిత్రాన్ని నిర్మించారు. 2000లో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణ సంస్థకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా మారింది. ఒకప్పటి హీరో చరణ్ ను సుప్రియ పెళ్లి చేసుకుంది. సుప్రియ భర్త చరణ్ కూడా మరణించారు. 2018లో ఆమె గూడాచారి సినిమా చేశారు. ఈ సినిమాతోనే ఆమెకు, అడవి శేష్ పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి వారు లవ్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
అడవి శేష్ సొంతం (2002) చిత్రంలో ఒక చిన్న అతిథి పాత్రలో నటుడిగా పరిచయం అయ్యాడు. 2010 చిత్రం కర్మలో దర్శకుడిగా, రచయితగా అరంగేట్రం చేశాడు.2016లో క్షణం సినిమాతో హిట్ సాధించిన అతను అప్పటి నుంచి క్రమం తప్పకుండా సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. ప్రస్తుతం సుప్రియ వయస్సు 45 ఏళ్లు కాగా అడవి శేష్ వయస్సు 38 సంవత్సరాలు.












Click it and Unblock the Notifications