ఇంటర్ విద్యార్థులకు అలర్ట్: పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలివే
తెలంగాణలో ఇంటర్మీడియట్ మొదటి, రెండో ఏడాదికి సంబంధించి పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలను ఇంటర్ బోర్డ్ ఖరారు చేసింది. నవంబర్ 6 నుంచి 26 వరకు ఎగ్జామ్ ఫీజులను చెల్లించేందుకు విద్యార్థులకు అవకాశం కల్పించింది. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. 100 రూపాయల అపరాధ రుసుముతో(ఫైన్) నవంబర్ 27 నుంచి డిసెంబర్ 4వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చని పేర్కొంది.
అదే విధంగా ఇంటర్ మొదటి, రెండో ఏడాదిలకు సంబంధించి పరీక్ష ఫీజుల వివరాలను కూడా తెలిపింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ జనరల్ విద్యార్థులకు రూ.520, ఒకేషనల్ విభాగం వారు రూ.750 పరీక్ష ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఇంటర్ ద్వితీయ సంవత్సరానికి సంబంధించి జనరల్ ఆర్ట్స్ విభాగం వారు రూ.520 పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. జనరల్ సైన్స్ వారు రూ.750, ఒకేషనల్ విద్యార్థులు రూ.750 చెల్లించాలి.

ఇంటర్ పరీక్షల ఫీజులకు సంబంధించి ముఖ్యమైన తేదీలు:
పరీక్ష ఫీజు చెల్లించేందుకు తేదీలు : నవంబర్ 6 నుంచి 26
100 రూపాయల ఫైన్‌తో : నవంబర్ 27 నుంచి డిసెంబర్ 4 వరకు చెల్లించవచ్చు
ఫస్ట్ ఇయర్ జనరల్ విద్యార్థులకు : రూ.520 చెల్లించాలి
ఫస్ట్ ఇయర్ ఒకేషనల్ విద్యార్థులకు : రూ.750 చెల్లించాలి
ఇంటర్ సెకండ్ ఇయర్ జనరల్ విద్యార్థులు : రూ.520
ఇంటర్ సెకండ్ ఇయర్ జనరల్ సైన్స్ వారు : 750
ఇంటర్ సెకండ్ ఇయర్ ఒకేషనల్ విద్యార్థులు : రూ.750.
తెలంగాణ టెట్ నోటిఫికేషన్ దరఖాస్తుల స్వీకరణ ఆలస్యం
తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. పాఠశాల విద్యాశాఖ ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. నవంబర్ 5 నుంచి 20వ తేదీ వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహించనున్నారు. ఏటా రెండుసార్లు టెట్ నిర్వహిస్తామని ప్రభుత్వం గతంలో పేర్కొన్న విషయం తెలిసిందే.
ఇందులో భాగంగానే ఈ ఏడాది మే 20 నుంచి జూన్ 2వ తేదీ వరకు ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటికే ఫలితాలు కూడా విడుదల అయ్యాయి.
ఇక రెండో టెట్‌కు నవంబర్‌లో నోటిఫికేషన్ జారీ చేస్తామని గతంలో ప్రభుత్వం వెల్లడించింది. ఈ క్రమంలోనే సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. టెట్ పేపర్-1కు డీఈడీ పూర్తి చేసిన వారు అర్హులు కాగా... టెట్ పేపర్-2కు బీఈడీ పూర్తి చేసిన వారు అర్హులు.
దరఖాస్తుల స్వీకరణ వాయిదా:
సాంకేతిక కారణాలతో టెట్ దరఖాస్తుల స్వీకరణ ఆలస్యమవుతోంది. నవంబర్ 7 నుంచి దరఖాస్తు చేసుకోవాలని విద్యాశాఖ తెలిపింది.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications