ప్రయాణికులకు అలర్ట్.. తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే 560 బస్సులు రద్దు...
ప్రయాణికులకు అలర్ట్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న కుంభ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇప్పటికే భారీ వర్షాల కారణంగా పలు రైళ్లను కూడా అధికారులు రద్దు చేశారు. ఇలాంటి సమయంలో తెలంగాణ ఆర్‌టిసి ప్రయాణికులకు ఓ షాకింగ్ న్యూస్ అందించింది. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే సుమారు 560కి పైగా బస్సులను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు ఉప్పొంగుతున్నారు. ఈ వర్షాలకు ప్రధాన రహాదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. రాష్ట్రంలోని చిల్లకల్లు నందిగామ వద్ద జాతీయ రహదారి-65పై వరద నీరు పొంగిపొర్లడంతో ఆ రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. దీంతో విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే 560కి పైగా బస్సులను రద్దు చేస్తున్నట్లు ఆర్‌టిసీ అధికారులు ప్రకటించారు. రద్దైన బస్సుల్లో ఖమ్మం జిల్లాలో 160 బస్సులు ఉన్నట్లు తెలిపారు. వీటితోపాటు వరంగల్ క్ చెందిన 150 బస్సులు రద్దయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 70కిపైగా బస్సులను రద్దు చేశారు. అయితే, ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని తెలంగాణ ఆర్టీసీ అధికారులు కోరారు.












Click it and Unblock the Notifications