ప్రయాణికులకు అలెర్ట్.. సికింద్రాబాద్ నుండి నడిచే నాలుగు రైళ్ళను చర్లపల్లికి మార్చిన రైల్వే!
ప్రయాణికులకు ముఖ్య గమనిక. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి రాకపోకలు సాగించే నాలుగు ప్రధాన రైళ్ళను చర్లపల్లి టెర్మినల్ కు మారుస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అభివృద్ధి పనులు జరుగుతున్నందున అక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా మార్పులు చేయడానికి రైల్వే బోర్డు ఆమోదం తెలిపిన మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.
చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఆ రైళ్ళు
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులను దశలవారీగా చేపడుతున్న రైల్వే మొత్తం 720 కోట్ల రూపాయల వ్యయంతో ఈ పనులను నిర్వహిస్తోంది. ఈ క్రమంలో మరో నాలుగు రైళ్లను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి కాకుండా చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి నడిచే విధంగా మార్పులు చేసినట్టు పేర్కొంది. ఇటీవల కాలంలో సరికొత్తగా రూపుదిద్దుకున్న చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరే రైళ్ళ సంఖ్య తాజా నిర్ణయంతో మరింత పెరిగింది.

తిరుపతి- ఆదిలాబాద్ కృష్ణ ఎక్స్ప్రెస్ రైలు
తిరుపతి- ఆదిలాబాద్ మధ్య నడిచే కృష్ణ ఎక్స్ప్రెస్ రైలు 17405 ఈనెల 26వతేదీ నుంచి చర్లపల్లి నుండి బయలుదేరుతుంది రాత్రి 8 నిమిషాలకు చర్లపల్లి టెర్మినల్ లో బయలుదేరి 9 గంటల 14 నిమిషాలకు బొల్లారం స్టేషన్ కు చేరుకుంటుంది. ఆదిలాబాద్ నుంచి తిరుగు ప్రయాణంలో ఈ రైలు 17406 ఉదయం నాలుగు గంటల 29నిమిషాలకు బొల్లారం కి చేరుకుంటుంది ఆపై ఐదు గంటల 45 నిమిషాలకు చర్లపల్లి చేరుకుంటుంది.
కాకినాడ లింగంపల్లి మధ్య నడిచే ప్రత్యేక రైలు
ఇక ఏప్రిల్ రెండవ తేదీ నుండి జూలై 1వ తేదీ వరకు కాకినాడ లింగంపల్లి మధ్య నడిచే ప్రత్యేక రైలు 07446 చర్లపల్లి నుండి బయలుదేరుతుంది. ఉదయం 7గంటల 20నిమిషాలకు చర్లపల్లిలో బయలుదేరి 9:15 నిమిషాలకు గమ్యస్థానం అయిన లింగంపల్లి కి చేరుకుంటుంది తిరుగు ప్రయాణంలో ఈ రైలు 07445 సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు లింగంపల్లిలో బయలుదేరి 7 గంటల 30 నిమిషాలకు చర్లపల్లి కి చేరుకుంటుంది.
హదాప్పర్ ఎక్స్ప్రెస్
ఇక కాజీపేట నుండి నడిచే హదాప్పర్ ఎక్స్ప్రెస్ 17014 రైలు రాత్రి 8 గంటల 20 నిమిషాలకు చర్లపల్లి కి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు 17013 తెల్లవారుజామున 3 గంటలకు చర్లపల్లి నుండి బయలుదేరుతుంది. ఇక ఏప్రిల్ 22వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తుంది.
లింగంపల్లి విశాఖపట్నం జన్మభూమి ఎక్స్ప్రెస్
మరో రైలు లింగంపల్లి విశాఖపట్నం మధ్య నడిచే జన్మభూమి ఎక్స్ప్రెస్ 12806 రైలు ఏప్రిల్ 25వ తేదీ నుంచి చర్లపల్లి నుండి నడుస్తుంది. ఉదయం 7 గంటల 15 నిమిషాలకు రైలు చర్లపల్లి కి చేరుకుంటుంది తిరుగు ప్రయాణంలో సాయంత్రం 6.05 నిమిషాలకు చర్లపల్లి కి చేరుకుంటుంది. ఇక ఈ రైళ్ల మార్పులను ప్రయాణికులు గమనించాలని దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో వెల్లడించింది.












Click it and Unblock the Notifications