Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హైదరాబాద్ కు మరో కీర్తి కిరీటం - ప్రపంచంలో అతిపెద్ద ప్రాంగణం టీహబ్‌ : నేడే ప్రారంభం..!!

భాగ్యనగరం కీర్తి కిరీటంలో మరో అద్భుతం ఆవిష్కారం కాబోతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆవిష్కరణల ప్రాంగణం టీహబ్‌ ప్రారంభానికి ముస్తాబైంది. ఒకేసారి నాలుగు వేలకు పైగా అంకురాలకు వసతి కల్పించేందుకు దీనిని నిర్మించారు. హైదరాబాద్‌ నగరం నడిబొడ్డున నూతనంగా నిర్మించిన ఈ ఐటీ హబ్‌ భవనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. నగరంలోని రాయదుర్గంలోని నాలెడ్జి సిటీలో రూ.400 కోట్లతో తెలంగాణ ప్రభుత్వం దీని నిర్మాణం పూర్తి చేసింది.

రెండు బేస్ మెంట్లు.. 10 అంతస్థులు..మూడు ఎకరాల విస్తీరణంలో.. 3.6 లక్షల చదరపు అడుగుల్లో 53.65 మీటర్ల ఎత్తులో ఈ ఐటి హబ్ నిర్మాణం పూర్తి చేసారు. ఐటీ హబ్ ప్రారంభోత్సవ వేళ ఐటీశాఖ కూయాప్‌తో...హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, హీరోమోటార్స్‌, పొంటాక్‌, వెబ్‌3 సంస్థలతో టీహబ్‌ అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోనుంది. టీహబ్‌ కొత్త భవనం ద్వారా ఆవిష్కరణలను పెద్దఎత్తున ప్రోత్సహించనున్నట్లు పరిశ్రమల ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌ వెల్లడించారు. టీహబ్‌ ప్రస్తుత భవనంలోని 250 అంకురాలు జులై మొదటి తేదీ నుంచి కొత్త భవనంలోకి మారతాయని వివరించారు. టీహబ్‌ పక్కనే నిర్మించిన టీవర్క్స్‌ బిల్డింగ్‌ను కూడా వచ్చే నెలలో ప్రారంభించనున్నారు.

All set to launch worlds largest innovation campus T-Hub to day by CM KCR

ఇమేజ్‌ యానిమేషన్‌ భవన సముదాయాన్ని ఈ ఏడాది చివరకు పూర్తి చేసే విధంగా ప్రణాళికలు సిద్దం చేసినట్లు జయేష్ రంజన్ చెప్పుకొచ్చారు. టీహబ్ ప్రారంభోత్సవ వేళ..ప్రత్యేకంగా అలంకరించారు. ఈ ఫొటోలను మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా షేర్ చేసారు. ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే మంత్రి కేటీఆర్ నేరుగా టీ హబ్ వద్దకు వెళ్లి.. ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇదే సమయంలో రతన్ టాటా సీఎం కేసీఆర్.. మంత్రి కేటీఆర్ ను అభినందిస్తూ ట్వీట్ చేసారు. ఇండియాలో స్టార్టప్ ఎకో సిస్టమ్ కు ఇది టీ హబ్ ప్రోత్సాహకంగా నిలుస్తుందని ఆకాంక్షించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+